సీపీఐ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీ: ఎందుకంటే?

First Published 30, Sep 2019, 11:51 AM IST

హు.జూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు సీపీఐ మద్దతు కోసం ఎందుకు పోటీ పడుతున్నాయనే చర్చ సర్వత్రా సాగుతోంది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో సీపీఐ మద్దతు కోసం అధికార, విపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. తమకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ నేతలు కోరిన మీదట కాంగ్రెస్ నేతలు కూడ సీపీఐ నేతల మద్దతు కోసం ప్రయత్నాలను ప్రారంభించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21వ తేదీన జరిగిన జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐను కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ బృందం సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శితో భేటీ కానున్నారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో సీపీఐ పోటీ చేయడం లేదు. ఈ నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంలకు మంది పట్టుంది.హుజూర్‌నగర్ పట్టణంలో సీపీఐ మంచి ఓటు బ్యాంకు ఉంది. 1967లో ఈ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్దిగా డి.నరసయ్య పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. సీపీఐ అభ్యర్ధి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సీపీఐ కూడ ఈ స్థానంలో ప్రధానంగా కేంద్రీకరించి పనిచేసింది. దొడ్డా నరసయ్య సీపీఐ కీలక నేతగా ఈ ప్రాంతంలో పనిచేశారు.

దొడ్డా నరసయ్య సోదరుడు దొడ్డా నారాయణ రావు కూడ ఈ ప్రాంతంలో సీపీఐ బలోపేతం కోసం పనిచేశారు. కొంత కాలం పాటు సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శిగా కూడ దొడ్డా నారాయణ రావు పనిచేశారు.

హుజూర్ ‌నగర్ అసెంబ్లీ స్థానంలో సీపీఎం పోటీ చేస్తోంది. మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్ రావును సీపీఎం తన అభ్యర్ధిగా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కూడ శేఖర్ రావు ఈ స్థానం నుండి పోటీ చేశారు.

ఈ దఫా కూడ అదే అభ్యర్ధిని సీపీఎం బరిలోకి దింపింది. సోమవారం నాడు శేఖర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నాలను ప్రారంభించాయి.

ఈ స్థానంలో వరుసగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధిస్తున్నారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ నుండి కైవసం చేసుకొనేందుకు టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది.

గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటితో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఉప ఎన్నికల్లోనైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ శక్తివంచన లేుకుండా ప్రయత్నాలను చేస్తోంది.

ఇందులో భాగంగానే సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలను చేస్తోంది. ఆదివారం నాడు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. అక్టోబర్ 1వ తేదీన జరిగే సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొంటామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేశారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడ సోమవారం నాడు సీపీఐ నేతలతో సమావేశం కానుంది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉఫ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కోరనున్నారు.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నేతృత్వంలో పీసీసీ బృందం సమావేశం కానుంది.

2018 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు ప్రజా కూటమిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో పొత్తుత విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంపై సీపీఐ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు కోరనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరారు. కాంగ్రెస్ నేతలు కూడ మద్దతు కోసం ప్రయత్నాలను ప్రారంభించారు.

loader