కులమే: ప్రణయ్, హేమంత్... ఇద్దరిదీ ఒకే కథ
ఈ రెండు కథల్లోనూ.. కూతుళ్లంతే వారి తండ్రులకు అమితమైన ప్రేమ. కానీ.. ఆ కూతుళ్ల ప్రేమను మాత్రం తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే.. వారికథలు విషాదాంతమయ్యాయి.
హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురు తమని కాదని.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కూతురు పెళ్లి చేసుకుందనే కనికరం కూడా లేకుండా.. దారుణంగా హత్య చేయించాడు. ఈ సంఘటన సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం జరిగిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యను తలపిస్తోంది.
అక్కడ ప్రణయ్ హత్యకి కులం అడ్డుగా మారగా.. ఇక్కడ హేమంత్ కథలో డబ్బు కీలకమైంది. తమ కులం కాదని ప్రణయ్ ని అమృత తండ్రి హత్య చేశాడు. కానీ.. ఇక్కడ హేమంత్ ది.. అవంతి కన్నా పెద్ద కులమే. కానీ.. ఆస్తి ఎక్కువ లేదనే కారణంతో హత్య చేయించారు.
ఈ రెండు కథల్లోనూ.. కూతుళ్లంతే వారి తండ్రులకు అమితమైన ప్రేమ. కానీ.. ఆ కూతుళ్ల ప్రేమను మాత్రం తండ్రి అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే.. వారికథలు విషాదాంతమయ్యాయి. అక్కడ అమృతా ప్రణయ్ కథలో మారుతీరావుకి ఆమె బాబాయి సహాయం చేయగా.. ఇక్కడ హేమంత్ కథలో.. అవంతి తండ్రికి ఆమె మేనమామ సహకరించాడు. పిల్లల ప్రేమను అర్థంచేసుకోపోగా..వారి కథలను నెత్తుటిమయం చేశారు.
హేమంత్ ఘటన నేపథ్యంలో.. అసలు ప్రణయ్ హత్య కేసులో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..
'మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత పదో తరగతి నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశారు. వీరి ప్రేమ విషయం తెలిసి అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి.. పలుమార్లు ప్రణయ్ ని హెచ్చరించారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని.. ఇద్దరూ వెళ్లి హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.
అమృత కులాంతర వివాహం మింగుడుపడని మారుతీరావు. అబ్బాయిని చంపించాలనుకున్నాడు. ఓ కిరాయి గుండాతో ప్రణయ్ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూతురు కడుపుతో ఉందని కూడా చూడకుండా.. అల్లుడిని అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు.
ప్రణయ్‌ను హత్య చేయటానికి బారీ, అస్గర్‌లు రెండున్నర కోట్ల రూపాయలు అడిగారు. కోటి రూపాయలకు డీల్ కుదిరింది. అడ్వాన్స్ కింద వారు రూ. 50 లక్షలు అడిగితే మారుతీరావు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. ఆ కారులోనే మిర్యాలగూడ వెళ్లి బారీకి, అస్గర్‌లకి ప్రణయ్ ఇళ్లు కూడా చూపించాడు.
పథకం ప్రకారం.. ఆస్పత్రికి వెళ్లి అమృతకు చెకప్ చేయించి వస్తుండగా.. నడి రోడ్డుపైనే మెడ నరికి హత్య చేశారు. కాగా.. ఈ కేసులో మారుతీరావు చాలా కాలంపాటు జైలు శిక్ష అనుభవించాడు.
ఆ తర్వాత జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన మారుతీరావు.. ఇటీవల ఆత్మహత్య చేసుకొని తన కథ ముగించాడు. కాగా.. అమృత మాత్రం తన భర్తకు జరిగిన దానిపై పోరాటం చేస్తూనే ఉంది.
కాగా.. తాజాగా.. హైదరాబాద్ లో ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంతో.. హేమంత్ ని అవంతి తండ్రి దారుణంగా హత్య చేయించాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.