తెలంగాణలో వరద బీభత్సం.. జలదిగ్భంధంలో గ్రామాలు, సహాయక చర్యలు (ఫోటోలు)
భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. అలాగే వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయి సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
telangana rains
తెలంగాణ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి డీజీపీ అంజనీ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
telangana rains
భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నీట మునిగింది. అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు
telangana rains
భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు పోటెత్తడంతో అది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
telangana rains
భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు పోలీస్ వాహనంలో వెళ్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.
telangana rains
ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో గోదావరి నది ప్రవాహాన్ని , అక్కపల్లి చెరువు నీటి మట్టాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టిందన్నారు.
telangana rains
భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు.
telangana rains
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వాగు ఉప్పొంగడంతో గ్రామం మొత్తం జలమయమైన సంగతి తెలిసిందే. దీంతో గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది .. హెలికాఫ్టర్లు, బోట్ల సాయంతో రక్షించారు.
telangana rains
భారీ వర్షాల ధాటికి తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ములుగు జిల్లాలోని మోరంచపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.
telangana rains
భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం వద్దకు పర్యాటకులు పోటెత్తారు.
telangana rains
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ నుంచి 6500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.