MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holiday : ఫిబ్రవరి 14న లవర్స్ డే ... స్కూళ్లు, కాలేజీలకు సెలవు

School Holiday : ఫిబ్రవరి 14న లవర్స్ డే ... స్కూళ్లు, కాలేజీలకు సెలవు

February 14 Holiday : ఫిబ్రవరి 14న తెలుగు విద్యార్థులకు సెలవు వస్తోంది. ఈ రోజు తెలంగాణలోని విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 03 2025, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
February 14 Holiday

February 14 Holiday

February 14 Holiday : ఫిబ్రవరి  14న ప్రేమికుల దినోత్సవం... ఈరోజు తమకు ఇష్టమైన వారితో హాయిగా గడపాలని యువతీయువకులు కోరుకుంటారు. ఇలా వాలంటైన్స్ డే సందర్భంగా కలుసుకోవాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుకు కారణం వేరే అయినప్పటికీ ఇది ప్రేమికులకు కలిసివస్తోంది. 

ఈ ఫిబ్రవరి 14 ముస్లింలకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున షబ్-ఎ-బరాత్ పర్వదినాన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు... ప్రత్యేకంగా రాత్రి సమయంలో చేస్తుంటారు. ఈ ప్రార్థన ద్వారా అల్లాను క్షమాపణలు కోరతారు...  ఈరోజు చేసే ప్రార్థనల వల్ల తప్పులన్పింటిని క్షమించి మోక్షం ప్రసాధిస్తాడని ముస్లింలు నమ్ముతారు. ఈరోజు కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. 

ఇలా ముస్లింల పవిత్రమైన రోజు కాబట్టి ఈ షబ్-ఎ-బరాత్ సందర్భంగా ఫిబ్రవరి 14న ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే విద్యాసంస్థల యాజామాన్యాలు ఈ రోజున సెలవు ఇవ్వవచ్చు... లేదంటే కొనసాగించవచ్చు. తుది నిర్ణయం వారిదే. 
 

23
school holiday

school holiday

ఫిబ్రవరి 14న స్కూళ్లు, కాలేజీలకు సెలవు :  

ఈ ఏడాది(2025) తెలుగు రాష్ట్రల్లో విద్యాసంస్థలకు సెలవులే సెలవులు వస్తున్నాయి. న్యూ ఇయర్ ఆరంభమే సెలవుతో జరిగింది... జనవరి 1న స్కూళ్లు, కాలేజీలకు సెలవు వచ్చింది. ఇక ఈ నెలలో సంక్రాంతికి భారీగా సెలవులు వచ్చాయి. ఆ తర్వాత జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో నేషనల్ హాలిడే వచ్చింది... కానీ ఇది సండే రావడంతో సాధారణ సెలవుతో కలిసిపోయింది. 

ఇక జనవరి 28న షబ్-ఎ-మేరాజ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజున ముస్లి మైనారిటీ విద్యాసంస్ధలు సెలవు పాటించాయి. అలాగే హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్ధలు సెలవు ఇచ్చాయి.  ఇక ముస్లిం మైనారిటీలు ఎక్కువగా వుండే ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవు ఇచ్చారు.

ఇలాగే ఈ నెలలో ఫిబ్రవరి 3న అంటే ఇవాళ వసంత పంచమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 14న కూడా మరో ఆప్షనల్ హాలిడే వస్తోంది. షబ్-ఎ-బరాత్ సందర్భంగా మరో ఆప్షనల్ హాలిడే వస్తోంది. ఈరోజున ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలు సెలవు పాటించనున్నాయి. 

33
valentine's day

valentine's day

ప్రేమికులకు కలిసివస్తున్న సెలవు :

ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలంటైన్స్ డే జరుపుకుంటారు... ఇండియాలో కూడా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈరోజు ఒకరంటే ఒకరు ఇష్టపడే యువతీయువకులు ప్రేమను వ్యక్తం చేసుకోవడం... ఇప్పటికే ప్రేమలో వున్నవారు సరదాగా గ్రీటింగ్ కార్డులు. గిప్టులు పంచుకుంటూ ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇలా లవర్స్ డే ను ఇండియాలో కూడా జరుపుకుంటారు. 

అయితే ప్రేమికుల రోజుల తెలంగాణలోని కొన్ని విద్యాసంస్థలకు సెలవు వస్తోంది. ఇది ప్రేమికులకు కలిసివచ్చే అంశం. ఆరోజు తమకు ఇష్టమైన వారితో చెట్టాపట్టాలేసుకుని షికారు కొట్టవచ్చు. ఇలా యువతీయువకులు ఫిబ్రవరి 14 సెలవు కలిసివస్తోంది. 

ఇక పిబ్రవరిలో విద్యాసంస్థలకు మరో సెలవు కూడా వస్తోంది. ఫిబ్రవరి 28న మహా శివరాత్రి సందర్భంగా విద్యాసంస్థలకు సాధారణ హాలిడే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సెలవు వుంటుంది... హిందూ దేవాలయాలు కిటకిటలాడుతాయి.  
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Recommended image2
Hyderabad: రూ. 12 వేల కోట్లతో అద్భుత ప్రాజెక్ట్.. హైదరాబాద్ నుంచి గోవాకు భారీగా తగ్గనున్న దూరం
Recommended image3
Rain Alert: దూసుకొస్తున్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు, అల్లకల్లోలం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved