MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • టూరిస్టులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ సమాధులు ... మీరు చూసారా?

టూరిస్టులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ సమాధులు ... మీరు చూసారా?

కాదేదీ కవితకు అనర్హం అన్నాడు ఆనాటి ఓ కవి ... కాదేది చూసేందుకు అనర్హం అంటున్నారు నేటి పర్యాటకులు. ప్రకృతి అందాలు, ప్రాచీన ప్రదేశాలే కాదు సమాధులు కూడా టూరిజం స్రాంతాలుగా మారాయి. ఇలా హైదరాబాద్ లో కొన్ని సమాధులను చూసేందుకు ప్రజల ఇష్టపడుతున్నారు.   

2 Min read
Arun Kumar P
Published : Sep 14 2024, 07:56 PM IST| Updated : Sep 14 2024, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Hyderabad

Hyderabad

Hyderabad Tourism : అందమైన ప్రకృతి అందాలు లేదంటే అద్భుత శిల్పకళతో కూడిన ప్రాచీక కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని అందించే వాటిని ప్రభుత్వాలు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతుంటాయి. ఇలా పచ్చటి అడవులు, జాలువారే జలపాతాలు, జలాశయాలు, సరస్సులు, నదులు, హిల్ స్టేషన్స్, రాజ భవనాలు, ప్రాచీన ప్రార్థనా స్థలాలు వంటివి పర్యాటక ప్రాంతాలుగా మారతాయి. చివరకు ప్రకృతి విపత్తులు,  ప్రమాదాలు, ఉద్రిక్త పరిస్థితులను చూసేందుకు ప్రజలు తరళివెళ్లడం డార్క్ టూరిజంగా ప్రసిద్ది చెందింది. అలాంటిది సమాధుల సందర్శన  కూడా టూరిజంలో భాగమయ్యింది. 
 

25
hyderabad

hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా పలు ప్రాచీన సమాధులు టూరిజం స్పాట్స్ గా మారాయి. అవి మామూలు సమాధులు కావు... అద్భుత శిల్పకలతో నగర చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచినవి. అంతేకాదు హైటెక్ నగర అందాలను మరింత పెంచేలా ఈ సమాధులు వున్నాయి. ఇలా పర్యాటకులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ సమాధులేమిటో చూద్దాం. 
 

35
qutubshahi tombs

qutubshahi tombs

కుతుబ్ షాహీ సమాధులు : 

హైదరబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ వంశీయులు సమాధులు ఇప్పుడు సందర్శనీయ ప్రదేశాలుగా మారాయి. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించిన ఈ సమాధులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. 16వ శతాబ్దానికి చెందిన చారిత్రక సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి. 

హైదరాబాద్ ను పాలించిన కుతుబ్ షాహీ సుల్తానుల సమాధులన్ని ఇలా ఒకేచోట వున్నాయి. కుతుబ్ షాహీలు సమాధులను ఎంతో పవిత్రమైనవిగా భావించేవారట...అందువల్లే అత్యంత సుందరంగా వారి పూర్వికుల సమాధులను తీర్చిదిద్దారు. ఇలా ప్రతిఒక్కరు తమకంటే ముందు పాలించిన సుల్తానుల సమాధులను నిర్మించి పరిరక్షించారు. అందువల్లే ఇప్పటికీ ఈ సమాధులు చెక్కుచెదరకుండా నిలిచాయి. 

ఈ సమాధులు గోల్కొండ కోటకు ఉత్తరాన కిలోమీటర్ దూరంలో ఇబ్రహీ బాగ్ లో వున్నాయి.  ఒకప్పుడు ఈ సమాధులపై ఖరీదైన కార్పెట్లు,వెల్వెట్ తెరలు, షాండ్లియర్లు, వెండి అలంకరణ సామాగ్రి వుండేవి. అలాగే అందమైన పూదోటలు వుండేవి. కాలక్రమేనా ఇవన్నీ కనుమరుగయ్యాయి. కానీ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సమాధులను హైదరాబాదీలు,తెలుగు ప్రజలే కాదు దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు.
 

45
Paigah Tombs

Paigah Tombs

పైగా సమాధులు : 

పైగా సమాధులు కూడా హైదరాబాద్ లో సందర్శనీయ ప్రాంతాలు. వీరు రాజులు కాదు... నిజాం రాజుల వద్ద కీలక బాధ్యతలు నిర్వర్తించివారు. ఇలా నిజాం పాలనలో కీలకంగా వ్యవహరించిన ఈ పైగా వంశీయుల సమాధులు పాతబస్తీ ప్రాంతంలో వున్నాయి. పిసల్ బండ ప్రాంతంలో ఓవైసిహాస్పిటల్ కు సమీపంలో ఈ సమాధులు వున్నాయి. 

అద్భుతమైన పురాతన కళలను ఈ సమాధుల గోడలపై చూడవచ్చు.   అందమైన పాలరాతి శిల్పాలు,  కళాసంపదకు ఈ సమాధుల వద్ద కనిపిస్తుంది. 200 సంవత్సరాల నాటి ఈ సమాధులను నిర్లక్ష్యంగా వదిలేయడంతో బాగా  దెబ్బతిన్నాయి. అయినప్పటి ఇప్పటికీ ఆ చెదిరిన సమాధుల అందాలే పర్యాటకులకు ఆకట్టుకుంటాయి. 
 

55
NTR Ghat

NTR Ghat

ఎన్టిఆర్ ఘాట్ : 

తెలుగు సినీ, రాజకీయ చరిత్రలో నిలిచిపోయే పేరు నందమూరి తారక రామారావు (ఎన్టిఆర్). సినీ నటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించారో... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంతకంటే చక్కటి పాలన అందించారు ఎన్టిఆర్. ఇలా తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే ఆయన సమాధి హుస్సెన్ సాగర్ తీరంలో వుంది. 

ఎన్టిఆర్ సమాధి ఇప్పుడు హైదరాబాద్ లోని సందర్శనీయ ప్రదేశాల్లో ఒకటి. ఎన్టిఆర్ ఘాట్ గా పిలవబడే ఈ సమాధి నిర్మాణం, చుట్టూ అలంకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎన్టిఆర్ జయంతి, వర్దంతి సమయంలో నందమూరి కుటుంబసభ్యులు, టిడిపి నాయకులు, పర్యాటకులతో ఈ ఘాట్ సందడిగా వుంటుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
Recommended image2
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Recommended image3
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved