- Home
- Telangana
- తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని పరామర్శించిన ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ (ఫోటోలు)
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని పరామర్శించిన ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ (ఫోటోలు)
కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా వ్యవహరించారని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. గురువారం ఆయన బండిసంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

Raman Singh
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు విషయంలో కరీంనగర్ పోలీసులు డెకాయిట్లలా పనిచేశారని, కార్యకర్తలను, మహిళలను కూడా చూడకుండా లాఠీ ఛార్జ్ చేసి గాయపర్చారని చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఆరోపించారు. గురువారం ఆయన బండిసంజయ్, ఇతర బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
Raman Singh
కరీంగనర్‌లో వేలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరీంనగర్ కమిషనర్, ఈ అరెస్టులో పాల్గొన్న ఇతర పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. అలాగే వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Raman Singh
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం మొదలైందని చత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతోందని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు లాఠీల దెబ్బలకు, బుల్లెట్ల గాయాలకు భయపడేవారు కారని అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు చూపుతున్న పోరాటానికి, తెగువకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
Raman Singh
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో సవరించాలని పోరాటం చేస్తున్న బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ నాయకుల పోరాటం అభినందనీయమని మాజీ సీఎం రమణ్ సింగ్ అన్నారు. తాను గతంలో ఒక సారి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తెలంగాణకు వచ్చానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించానని చెప్పారు.
Raman Singh
తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల్లో టీఆర్ఎస్ రూ.500 ఖర్చు పెట్టిందని, అయినా ఆ పార్టీ అక్కడ గెలవలేకపోయిందని తెలిపారు. ఈ ఓటమి వల్లనే టీఆర్ఎస్ పార్టీలో అసహనం పెరిగిపోయిందని చెప్పారు. అందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలీసులకు కరీంనగర్ ఎంపీ ఆఫీసులోకి చొరబడి, దానిని ధ్వంసం చేసే అధికారం లేదని అన్నారు.