MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కేసీఆర్ ఎన్టీఏలో చేరాలనుకున్నది వాస్తవమే... నేను బిఆర్ఎస్ లో వుండగానే : ఈటల సంచలనం

కేసీఆర్ ఎన్టీఏలో చేరాలనుకున్నది వాస్తవమే... నేను బిఆర్ఎస్ లో వుండగానే : ఈటల సంచలనం

గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బిఆర్ఎస్ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చే ప్రయత్నాలు చేసారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Arun Kumar P | Published : Oct 05 2023, 08:13 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Eatala Rajender

Eatala Rajender

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. బిఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో చేరేందుకు ప్రయత్నించిందని... స్వయంగా కేసీఆర్ తనను సంప్రదించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బిజెపి నాయకులు సమర్దిస్తుంటే బిఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బిఆర్ఎస్ లో కీలక నాయకుడిగా కొనసాగిన ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 
 

25
Eatala Rajender

Eatala Rajender

బిజెపి  నేతృత్వంలోని ఎన్డీఏ లో కలవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనని ఈటల అన్నారు. తాను బిఆర్ఎస్ లో వున్న సమయంలోనూ ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయన్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా సాగుతుందో ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసు... అది నచ్చకే బిఆర్ఎస్ ను చేరదీయలేదని అన్నారు. లేదంటే ఏనాడో  బిఆర్ఎస్ ఎన్టీఏలో చేరేదంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేసారు. 

35
Eatala Rajender

Eatala Rajender

ఇప్పుడు ప్రధాని మోదీ రాజకీయాల కోసమే అబద్దాలు మాట్లాడుతున్నారంటున్న బిఆర్ఎస్ నాయకులకు కూడా కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న విషయం తెలుసని ఈటల అన్నారు. కానీ రాజకీయాల కోసమే వాళ్లు ప్రధానిపై ఎదురుదాడి దిగుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ కేసీఆర్ గురించి చెప్పిన మాటలన్ని వాస్తమేనని ఈటల అన్నారు. 

45
Eatala

Eatala

ఇక తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో ఖర్చు పెట్టారన్న ప్రధాని వ్యాఖ్యలపై ఈటల రియాక్ట్ అయ్యారు. మోదీ దేశ ప్రధాని... దేశంలో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసన్నారు. సమాచారం లేకుండానే కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసారని ప్రధాని మాట్లాడి వుండరన్నారు. తన రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల డబ్బులను కేసీఆర్ ఎవరికి ఎంత పంపించారో ప్రధానికి తెలుసన్నారు. అయినా ఎన్నికల ఖర్చులు చూసుకుంటా... తనకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ దేశంలోని పలు రాజకీయ పార్టీలను కోరింది వాస్తవం కాదా? అని ఈటల ప్రశ్నించారు. 

55
Eatala

Eatala

చీటింగ్ చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అని ఈటల మండిపడ్డారు. హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో దళిత బంధు అన్నారు... ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి బిసి బంధు అంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే బిసి, దళిత బంధు ఇస్తామని ఆ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాట వింటే మళ్ళీ గోస పడతారని ప్రజలకు ఈటల రాజేందర్ హెచ్చరించారు. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
భారత రాష్ట్ర సమితి
భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోదీ
 
Recommended Stories
Top Stories