మునుగోడు కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు: ఎమ్మెల్యే టిక్కెట్టుపై స్రవంతి, కృష్ణారెడ్డి మధ్య రచ్చ
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డిలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు అంశం కేంద్రంగా సాగుతున్న ప్రచారం ఈ ఇద్దరు నేతల మధ్య వివాదానికి కారణమైంది.
ఆధిపత్యపోరు
కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డిలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
ఆధిపత్య పోరు
గత ఏడాది జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. కానీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కోసం చలమల కృష్ణారెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని ప్రచారం సాగింది. కానీ, పార్టీ సీనియర్లంతా పాల్వాయి స్రవంతి వైపే మొగ్గు చూపారు. దీంతో పాల్వాయి స్రవంతికే కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది.
ఆధిపత్యపోరు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టు విషయమై సాగుతున్న ప్రచారం కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి మధ్య రచ్చకు కారణమైంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు అంటూ ప్రచారంచేసుకుంటున్నారని కృష్ణారెడ్డిని ఉద్దేశించి పాల్వాయి స్రవంతి ఆరోపిస్తున్నారు.
ఆధిపత్య పోరు
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు, వెధవలున్నారని కృష్ణారెడ్డి చేసిన విమర్శలపై పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. కోవర్టులు, వెధవలు ఎవరో చెప్పాలని పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు.
ఆధిపత్యపోరు
టిక్కెట్టు కేటాయింపు విషయంలో సాగుతున్న ప్రచారం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను గందరగోళానికి గురి చేస్తుందని స్రవంతి అభిప్రాయపడ్డారు.ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని కూడా ఆమె చెప్పారు.
ఆధిపత్యపోరు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు విషయమై కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కమిటీల నియామకం జరగేలేదన్నారు. కానీ, మునుగోడు నియోజకవర్గంలోనే కమిటీలను ఏర్పాటు చేశారని స్రవంతి చెప్పారు. ఈ విషయమై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఆధిపత్యపోరు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. దరిమిలా మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నికలు జరిగాయి