MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • 34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  34  మంది బీసీలకు టిక్కెట్లు  ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
 
narsimha lode | Published : Jul 25 2023, 05:35 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

2023లోతెలంగాణ అసెంబ్లీకి  జరిగే ఎన్నికల్లో  34 మంది బీసీలకు  టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది.ఈ విషయమై  ఈ నెల  23వ తేదీన  జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో  చర్చించారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఈ విషయాన్ని ప్రతిపాదించారు. 
 
28
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

ఈ నెల  5వ తేదీన  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య  నివాసంలో  కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  బీసీ నేతలకు 35 నుండి  50 అసెంబ్లీ సీట్లు  ఇవ్వాలని డిమాండ్  చేశారు. ఆయా జిల్లాల్లోని  బీసీలకు  ఇవ్వాల్సిన సీట్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు  పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందించారు.  బీసీలకు సీట్ల కేటాయింపు విషయమై  ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అభ్యర్థుల జాబితాలో  బీసీలకు  కేటాయించే సీట్లే తొలుత ఉంటాయి. 

38
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

గత ఎన్నికల సమయంలో  బీసీ అభ్యర్థులకు  సీట్ల కేటాయింపులో  చోటు చేసుకున్న ఇబ్బందులను కాంగ్రెస్ నేతలు  రాహుల్ గాంధీకి వివరించారు. దీంతో  బీసీలకు సీట్ల కేటాయింపుపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టాలని  రాహుల్ గాంధీ  రాష్ట్ర నాయకత్వానికి సూచించారు.

48
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

రెండు  రోజుల క్రితం  జరిగిన  కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో  బీసీలకు  34 సీట్లు కేటాయించాలనే  అంశంపై చర్చించారు.ఈ మేరకు  నేతలు  ఏకాభిప్రాయానికి వచ్చారు.  రాష్ట్రంలోని ప్రతి  రెండు అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరు బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

58
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

17 పార్లమెంట్ స్థానాల్లో  రెండేసి  అభ్యర్థుల చొప్పున  34 అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

68
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

వంద  రోజుల పాటు  కాంగ్రెస్ పార్టీ తాము చేసిన డిక్లరేషన్లను విస్తృతంగా  ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను  చేసింది.ఈ నెల  30న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ పాల్గొనే సభలో  మహిళా డిక్లరేషన్ ను  ప్రకటించే  అవకాశం ఉంది. మరో వైపు  బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీలకు డిక్లరేషన్లను  కూడ ప్రకటించనున్నారు.

78
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

ఈ ఏడాది ఆగష్టు 15న  హైద్రాబాద్ లో  బీసీ, ఎస్ సీ, ఎస్టీ, మైనార్టీలను తమ వైపునకు తిప్పుకొనేందుకు గాను  భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సభలో  ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే  పాల్గొంటారు.

88
34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు:  తెలంగాణ  కాంగ్రెస్ కీలక నిర్ణయం

34 మంది బీసీలకు అసెంబ్లీ టిక్కెట్లు: తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో  బీసీ జనాభా  56 శాతానికి పైగా ఉంటుంది.  ఆయా పార్టీల గెలుపు ఓటములను  బీసీ ఓటర్లు నిర్ణయిస్తారు.  దీంతో బీసీలను తమ వైపునకు తిప్పుకొనేందుకు  పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 

narsimha lode
About the Author
narsimha lode
తెలంగాణ
 
Recommended Stories
Top Stories