MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీలను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు కార్యాచరణను  సిద్దం  చేస్తుంది.

narsimha lode | Published : Jul 19 2023, 05:15 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

 తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా  ఉన్న బీసీలను తమ వైపునకు తిప్పుకొనేందుకు  బీఆర్ఎస్  కసరత్తు చేస్తుంది.  బీఆర్ఎస్ నాయకత్వం  బీసీ  జపం మొదలు పెట్టింది.  త్వరలోనే  హైద్రాబాద్ వేదికగా  బీసీ ఆత్మగౌరవం పేరుతో సభను నిర్వహించనుంది  బీఆర్ఎస్.

26
బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు  బుధవారంనాడు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో  సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  కాంగ్రెస్  పార్టీని రాజకీయంగా  ఏ రకంగా దెబ్బతీయాలనే దానిపై  చర్చించారు. బీఆర్ఎస్ నుండి వలసలను నివారించడంతో పాటు  ప్రత్యర్ధులకు ఏ రకంగా చెక్ పెట్టాలనే దానిపై  నేతల మధ్య  చర్చ జరిగింది.  

36
బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కొన్ని బీసీ కులాలను కించపర్చేలా చేసిన వ్యాఖ్యలపై  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఫైరయ్యారు.  ఈ వ్యాఖ్యలను ఆసరాగా తీసుకొని రాజకీయంగా  కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది.  కొన్ని సామాజిక వర్గాల నేతలు  రేవంత్ రెడ్డిపై  విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు  దగ్దం  చేయాలని పిలుపునిచ్చారు.

46
బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉంది.  బీసీ సామాజిక వర్గం ఓటర్లు  ఎటువైపు మొగ్గుచూపితే  ఆ పార్టీల విజయావకాశాలు మెండుగా ఉంటాయి.  గతంలో  బీసీలు  టీడీపీకి  వెన్నంటి నిలిచారు.  రాష్ట్ర విభజన, ఇతర కారణాలతో  టీడీపీ  తెలంగాణలో ఉనికి కోసం పోరాడే పరిస్థితి నెలకొంది. టీడీపీ ఓటు బ్యాంక్  ఇతర పార్టీల వైపు మళ్లింది.

56
బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల ఫలితాల తర్వాత  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం కన్పిస్తుంది. దీంతో కాంగ్రెస్ ను రాజకీయంగా  దెబ్బతీసేందుకు  బీఆర్ఎస్ బీసీల అస్త్రాన్ని ఉపయోగించనుంది.   బీసీలకు  తమ పార్టీ ఏం చేసిందనే విషయాన్ని  వివరించనుంది. ఈ మేరకు  హైద్రాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

66
బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

బీసీ జపం: బీఆర్ఎస్ కు కలిసొచ్చేనా?

మరో వైపు బీసీలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా  మోసగించిందనే విషయాలను  బీఆర్ఎస్ వివరించనుంది.  బీసీ నేతలను  కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా  అవమానించిందనే  దానిపై  కూడ బీఆర్ఎస్ నేతలు వివరించనున్నారు.

narsimha lode
About the Author
narsimha lode
భారత రాష్ట్ర సమితి
 
Recommended Stories
Top Stories