ఈటల రాజేందర్ కు తీవ్ర అస్వస్థత... పరామర్శించిన రఘునందన్, రాజాసింగ్
ప్రజా దీవెన యాత్ర పేరిట తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ పరామర్శించారు.
15

హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజా దీవెన యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి వైద్యం నిమిత్తం ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. చికిత్స పొందుతున్న ఆయనను ఇవాళ(ఆదివారం) దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు.

25
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈటల రాజేందర్ వీణవంక మండలంలో పాదయాత్ర చేస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పరీక్షించిన వైద్యులు ఆక్సిజన్, బీపీ లెవెల్స్ పడిపోయాయని... మెరుగైన చికిత్స అవసరమని సూచించారు. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు.

35
ఇలా అపోలో హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపి వివేక్, బిజెపి జాతీయ నాయకురాలు డీకె అరుణ శనివారం పరామర్శించారు. తాజాగా ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు పరామర్శించారు.

45
అస్వస్థతకు గురి కావడంతో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ప్రజా దీవెన పాదయాత్ర ఆగిపోయింది. గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు.

55
భూకబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజేందర్ ను తన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బిజెపిలో చేరారు హూజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఈటల రాజేందర్ ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
eatala rajender
Latest Videos