నాడు నోటా కంటే తక్కువ ఓట్లు: ఈటల చేరికతో బీజేపీకి హుజూరాబాద్‌లో కలిసొచ్చేనా?
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంపై బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటి నుండే ఫోకస్ పెట్టాయి. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై ఈ రెండు పార్టీలు కన్నేశాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుండి వరుస విజయాలు సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన రాజీనామా పత్రాన్పి సమర్పించనున్నారు.

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదం పొందిన రోజు నుండి ఆరు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టుగా ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని ఆయన ఇంకా స్పీకర్ కు అందించలేదు.

2018 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో రాజా సింగ్ మినహా బీజేపీ అభ్యర్ధులంతా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో బీజేపీ పోటీ చేసింది.ఈ ఎన్నికల్లో బీజేపీ 5 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకొంది. 2018 ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడ దక్కలేదు. కొన్ని నియోజకవర్గాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ కు 1,04,840 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో ఆయనకు 59.34 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రఘు పుప్పాలకు 1683 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2867 ఓట్లు వచ్చాయి.

రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్పారు. ఈ నెల 11వ తేదీ తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు.

బీజేపీలో చేరడానికి ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉంది. ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఆరు మాసాల్లో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించడం అనివార్యం.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడ కొంతకాలంగా సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం పెద్దిరెడ్డిని కొంత అసంతృప్తికి గురి చేసింది. అయితే పెద్దిరెడ్డికి బీజేపీ నాయకత్వం ఎలాంటి హమీ ఇస్తోందోననే చర్చ సాగుతోంది.

ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉప ఎన్నికలు జరిగితే ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ లేదా ఆయన భార్య పోటీ చేసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే లక్ష్యంగా కమలదళం కూడ వ్యూహాలను రచించే అవకాశం ఉంది.

ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం కూడ అదే స్థాయిలో ప్రయత్నాలు సాగించనుంది.ఇప్పటి నుండే గులాబీదళం హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ లేదా ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బీజేపీ గతంలో కంటే మెరుగైన ఓట్లను సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక తరహలో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కమలదళం పనిచేసే అవకాశాలున్నాయనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి గట్టి పట్టుండే నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం కూడ ఒకటిగా మారే అవకాశం లేకపోలేదు.