MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : ఫిబ్రవరిలో మొత్తం ఏడ్రోజులు సెలవులు ... ఏ రోజు ఎందుకో తెలుసా?

Holidays : ఫిబ్రవరిలో మొత్తం ఏడ్రోజులు సెలవులు ... ఏ రోజు ఎందుకో తెలుసా?

జనవరిలో బాగానే సెలవులు వచ్చాయి... అంతలా కాకున్నా ఫిబ్రవరిలోనూ కొన్ని సెలవులు వున్నాయి.  ఇలా వచ్చేనెలలో ఏ రోజు ఎందుకు సెలవు వుందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jan 30 2025, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Bank Holidays in February

Bank Holidays in February

Bank Holidays in February :  వచ్చే నెల ఫిబ్రవరిలో మీకు బ్యాంకులో ఏదయినా పని వుందా? ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి రావచ్చా? అయితే ఫిబ్రవరిలో బ్యాంకులు ఏ రోజుల్లో నడుస్తాయి... ఏ రోజుల్లో సెలవు వుందో తెలుసుకోవడం మంచింది. బ్యాంకులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కారణంతో సెలవులు వుంటాయి...  మరి తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఫిబ్రవరిలో ఎన్ని సెలవులు వున్నాయో చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Bank Holidays in February

Bank Holidays in February

తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు సెలవులు : 

 న్యూ ఇయర్ లోకి తొలి అడుగే సెలవులతో పడింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనవరి 1, 2025 లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. ఇక సంక్రాంతి పండక్కి కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. ఇక నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఎలాగూ బ్యాంక్ ఎంప్లాయిస్ కు సెలవే. ఇలా జనవరి బ్యాంకులకు బాగానే సెలవులు వచ్చాయి. 

అయితే జనవరిలాగే ఫిబ్రవరిలో కూడా బ్యాంకులకు కొన్ని సెలవులు వస్తున్నాయి. నెలలో ఆదివారాలు, రెండు శనివారాలు (రెండు, నాలుగో) ఎలాగూ సెలవు వుంటుంది. అంటే ఫిబ్రవరి 2,8,9,16,22,23 తేధీల్లో బ్యాంక్ ఉద్యోగులకు సెలవు. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా సెలవు వస్తుంది. అంటే మొత్తంగా ఫిబ్రవరిలో ఏడురోజులు బ్యాంకులు మూసివుండనున్నాయి. 

34
Bank Holidays in February

Bank Holidays in February

ఫిబ్రవరిలో చివరి వీకెండ్ ను లాంగ్ వీకెండ్ గా మార్చుకోండిలా...

అయితే ఫిబ్రవరిలో ఓ వీకెండ్ ను బ్యాంక్ ఉద్యోగులు లాంగ్ వీకెండ్ గా మార్చుకోవచ్చు. ఫిబ్రవరి 22 నాలుగో శనివారం, ఫిబ్రవరి 23 ఆదివారం ఎలాగూ సెలవే... ఫిబ్రవరి 24, 25 తేదీలు అంటే రెండ్రోజులు లీవ్ తీసుకుంటే మళ్లీ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా మరో సెలవు కలిసివస్తుంది. కాబట్టి అధికారికంగా మూడు సెలవులు, అదనంగా రెండు లీవ్స్ కలుపుకుంటే వరుసగా ఐదురోజుల హాలిడేస్ వస్తాయి. 

ఇలా ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చే వీకెండ్ ను బ్యాంక్ ఎంప్లాయిస్ లాంగ్ వీకెండ్ గా మార్చుకునే అవకాశం వుంది. ఈ ఐదురోజులు కుటుంబంతో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు... ఇష్టమైన ప్రాంతాల్లో హాయిగా విహరించి రావచ్చు. హిందువులయితే ఆ మహాశివుడి ఇష్టమైన శివరాత్రి వేళ శ్రీశైలంకుగానీ లేదంటే మరేదైనా  జ్యోతిర్లింగాన్ని, ఇతర ఆలయాలను సందర్శించిరావచ్చు. 

మార్చిలో ఎలాగూ పిల్లలకు పరీక్షలు వుంటాయి... కాబట్టి వారు చదువుల ఒత్తిడిలో వుంటారు. ఈ సమయంలో సరదాగా  బయటకు తీసుకువెళితే వారుకూడా కాస్త రిలాక్స్ అవుతారు. కాబట్టి బ్యాంక్ ఎంప్లాయిస్ ఈ లాంగ్ వీకెండ్ ను సద్వినియోగం చేసుకుని పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసిరావచ్చు. 

 

44
Bank Holidays in February

Bank Holidays in February

 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడేస్ : 

ఫిబ్రవరి 2 : ఆదివారం 

ఫిబ్రవరి 3 : సోమవారం వసంత పంచమి సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే వుంది. త్రిపురలో సెలవు వుంది. 

ఫిబ్రవరి 8 : రెండో శనివారం 

ఫిబ్రవరి 9 : ఆదివారం 

ఫిబ్రవరి 11 : తమిళనాడులో సెలవు 

ఫిబ్రవరి 12 : గురు రవిదాస్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో హాలిడే 

ఫిబ్రవరి 15 : లూయి నగై సందర్భంగా మణిపూర్ లో సెలవు 

ఫిబ్రవరి 16 : ఆదివారం 

ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజి మహరాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో సెలవు 

ఫిబ్రవరి 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లో హాలిడే 

ఫిబ్రవరి 22 : నాలుగో శనివారం 

ఫిబ్రవరి 23 : ఆదివారం 

ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి   

ఇది కూడా చదవండి :

School Holidays : ఫిబ్రవరి 3న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ... లాంగ్ వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకోండి


  

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ఫీజుల షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభం? చివ‌రి తేదీ ఎప్పుడు.?
Recommended image2
ఎల్ నినో ఎఫెక్ట్ ఎంతున్నా.. హైదరాబాద్ లో నో వాటర్ ప్రాబ్లమ్ : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
School Holidays : అర్నబ్ తుపాను తీరందాటినా ఆగని వర్షబీభత్సం.. ఈ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved