MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : ఫిబ్రవరి 3న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ... లాంగ్ వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకోండి

School Holidays : ఫిబ్రవరి 3న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ... లాంగ్ వీకెండ్ లో టూర్ ప్లాన్ చేసుకోండి

జనవరి నెలంతా సెలవులతో గడిచిపోయింది. రాబోయే ఫిబ్రవరి కూడా సెలవులతో ప్రారంభం అవుతోంది. వచ్చే సోమవారం (ఫిబ్రవరి) 3న తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఎందుకో తెలుసా? 

3 Min read
Author : Arun Kumar P
Published : Jan 29 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
School Holiday

School Holiday

Telangana Holidays : సెలవులు... ఎవరికి ఇష్టం వుండవు చెప్పండి. పెద్దవాళ్లే సండే వచ్చిందంటే సంబరపడిపోతుంటారు... ఏదైనా పండక్కి సెలవు ఇస్తే ఎగిరి గంతేస్తారు. ఇలా ఉద్యోగాలు చేసే పెద్దవాళ్ళ పరిస్థితే ఇలా వుంటే స్కూల్ విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ కు వెళ్లకుండా వుండేందుకు చాలామంది చిన్నారులు పేరెంట్స్ తో జ్వరం, కడుపునొప్పి అంటూ నాటకాలాడుతుంటారు... అలాంటిది ప్రభుత్వమే సెలవు ఇచ్చిందంటే వారి ఆనందానికి అవధులు వుండవు. 

ఈ ఏడాది (2025) లో కేవలం ఒకేఒక నెల పూర్తి కావస్తోంది... కానీ సెలవులు మాత్రం భారీగా వచ్చాయి. న్యూ ఇయర్ మొదలు సంక్రాంతి సెలవుల వరకు తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు వచ్చాయి. ఇలా జనవరి మొత్తం ఎక్కువ సెలవులతోనే గడిచింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి కూడా సెలవుతో ఆహ్వానం పలుకుతోంది. 

తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలకు ఫిబ్రవరి 3న ఐచ్చిక సెలవు (ఆప్షనల్ హాలిడే) గా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలకు సెలవు వుండనుందన్నమాట. ఆరోజు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి వుంటుంది... హిందుత్వ, ఆద్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లుకు సెలవు వుండనుంది. 
 

24
Vasantha Panchami

Vasantha Panchami

వసంత పంచమి ప్రత్యేకత ఏమిటి? 

చదువుల తల్లి ఆ సరస్వతి మాత జన్మించిన  రోజును వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా జరుపుకుంటారు హిందువులు. ప్రతి ఏడాది మాఘశుద్ద పంచమిని అమ్మవారి జన్మదినంగా   నమ్మి ప్రత్యేక వేడుకలు జరుపుతుంటారు.  చిన్నాపెద్ద తేడాలేకుండా ఈ రోజున పుస్తకాలను పూజిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. 

ఈ రోజున చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. స్కూళ్లు, దేవాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తుంటారు. ఇక బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని ఆమె సన్నిధిలో పలకబలపం పడితే మంచి జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. 

ఇలా స్కూల్స్ లో వేడుకలు నిర్వహించడంతో పాటు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు దేవాలయాలకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు... అందువల్లే వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ వసంత పంచమి ఐటీ, కార్పోరేట్ కంపనీల ఉద్యోగులకు కూడా కలిసివస్తోంది. వారు పిల్లలతో కలిసి సరదాగా టూర్ కు వెళ్లేందుకు వరుసగా మూడు రోజుల సెలవు వస్తోంది. 
 

34
Long Weekend

Long Weekend

సెలవే కాదు లాంగ్ వీకెండ్ : 

హైదరాబాద్ లో చాలా స్కూళ్లకు శని, ఆదివారం రెండ్రోజులు వీకెండ్ సెలవులు వుంటాయి. ఇక వసంత పంచమి సోమవారం వస్తోంది. ఆ రోజు కూడా స్కూల్ కి సెలవు ఇస్తు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తాయి. కాబట్టి ఐటీ, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సోమవారం సెలవు పెడితే హాయిగా పిల్లలతో కలిసి టూర్ ప్లాప్ చేసుకోవచ్చు. 

ఐటీతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు శని, ఆదివారం రెండ్రోజులు సెలవు వుంటుంది. ఫిబ్రవరి 3న  వసంత పంచమి సందర్భంగా స్కూళ్లకు ఆప్షనల్ హాలిడే వుంది. కాబట్టి ఈ మూడురోజులు పేరెంట్స్ పిల్లలతో కలిసి చిన్న టూర్ కు వెళ్లవచ్చు. లేదంటే హైదరాబాద్ కు చెందినవారు బాసర  వంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి పుట్టినరోజున ఆ చదువుల తల్లి దర్శనం చేసుకోవచ్చు.  
 

44
Holidays in February

Holidays in February

ఫిబ్రవరిలో మొత్తం సెలవులెన్ని : 

వచ్చే నెల ఫిబ్రవరి సాధారణంగా నాలుగు ఆదివారాలు సెలవు వుంటుంది. ఇక ప్రత్యేక సెలవుల విషయానికి వస్తే 26న మహా శివరాత్రి వుంది. ఈ పండగను తెలంగాణ ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు కాబట్టి ఆ రోజు జనరల్ హాలిడేగా ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 14 షబ్-ఇ-బరాత్ సందర్భంగా అప్షనల్ హాలిడేస్ వున్నాయి.   

ఇలా ఫిబ్రవరిలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మొత్తం ఎనిమిది హాలిడేస్ వున్నాయి. అయితే రెండో శనివారం కూడా సెలవు వుండాలి...కానీ జనవరిలో ఓ సెలవును అదనంగా ఇచ్చినందుకు ఈ నెలలో రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా ప్రకటించారు. ఇలా ఈ నెలలో ఓ సెలవు మిస్ అయ్యింది. 

మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు వుంటాయి. ఇవి ముగియగానే దాదాపు నెల నెలన్నర వేసవి సెలవులు వుంటాయి. ఈ సెలవుల్లో విద్యార్థులు తెగ ఎంజాయ్ చేస్తారు. పరీక్షల కోసం ఈ రెండుమూడు నెలలు కష్టపడి చదివితే వేసవి సెలవుల్లో సరదాగా గడపవచ్చు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Recommended image2
Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Recommended image3
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved