- Home
- Telangana
- సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్!.. రామగుండం మీదుగా రాకపోకలు.. వివరాలు ఇవే..
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్!.. రామగుండం మీదుగా రాకపోకలు.. వివరాలు ఇవే..
తెలంగాణకు మరో వందే భారత్ రైలు రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలంగాణకు మరో వందే భారత్ రైలు రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్‌పూర్ స్టేషన్ మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. రామగుండం మీదుగా ఈ వందే భారత్ రైలు రాకపోకలు సాగించనుంది. ఈ రైలుకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ ఉండే అవకాశముంది.
ఇప్పటికే ఈ మార్గంలో వందే భారత్‌ను ప్రయోగాత్మక పరిశీలన(ట్రయల్ రన్)ను అధికారులు విజయవంతంగా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. మార్గమధ్యలో ఏ స్టేషన్‌లో ఆపకుండా ట్రయల్ రన్ పూర్తి చేశారు.
vande bharat
సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్ల సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెడితే.. ప్రయాణీకులు ఎంతో సౌకర్యం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఇప్పటికే దేశంలోని పలు నగరాల మధ్య సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
Vande Bharat Express
సికింద్రాబాద్-నాగ్‌పూర్ స్టేషన్ల మధ్య దాదాపు 580 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్‌లో వందే భారత్ రైలును ప్రవేశపెట్టడం ద్వారా దాదాపు 3.30 గంటల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్-నాగ్‌పూర్‌ల మధ్య ప్రయాణానికి 10 గంటల సమయం పడుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే 6.30 గంటల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేయడానికి వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని.. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకునే అవకాశం ఉంది. ఈ మార్గంలో వందే భారత్ రైలుపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.