MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల ఇప్పుడు నిజ‌మ‌వుతుంది.. రాజీవ్ స్వ‌గృహలో త‌క్కువ ధ‌ర‌కే ఫ్లాట్

హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల ఇప్పుడు నిజ‌మ‌వుతుంది.. రాజీవ్ స్వ‌గృహలో త‌క్కువ ధ‌ర‌కే ఫ్లాట్

బండ్లగూడ, పోచారంలో మార్కెట్‌కి 40% తక్కువ ధరకే ఫ్లాట్లు ఇవ్వనున్నారు.జులరై  29, 31 వరకు దరఖాస్తులు, ఆగస్టు 1లో లాటరీ ద్వారా కేటాయించనున్నారు.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 17 2025, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
సొంత ఇంటి కల
Image Credit : our own

సొంత ఇంటి కల

హైదరాబాద్ నగరంలో తక్కువ ధరలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఆశతో మధ్యతరగతి కుటుంబాలు మళ్లీ రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు అధిక స్పందన చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రాజెక్టులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరకే ఫ్లాట్లు లభిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్
Image Credit : Social Media

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్

ఈ నేపథ్యంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా నగర శివార్లలో ఉన్న రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఫ్లాట్ల విక్రయ ప్రక్రియను ప్రారంభించారు. ఒకటి నాగోల్ సమీపంలోని బండ్లగూడలో కాగా, మరొకటి గౌలిదొడ్డి సమీపంలోని పోచారంలో ఉంది. ఈ రెండు ప్రదేశాల్లో కలిపి మొత్తం 760 ఫ్లాట్లను విక్రయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

38
బండ్లగూడ ప్రాజెక్టు పై స్పందన:
Image Credit : freepik

బండ్లగూడ ప్రాజెక్టు పై స్పందన:

నాగోల్‌ సమీపంలోని బండ్లగూడలో ఉన్న 159 ఫ్లాట్లకు ఇప్పటికే విస్తృతంగా స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. దాదాపు 1200 మంది ఈ ఫ్లాట్ల కోసం ఫోన్‌ ద్వారా సమాచారం తీసుకోగా, 700 మందికి పైగా ప్రత్యక్షంగా ప్రాజెక్టు లొకేషన్‌ను సందర్శించారు. ఇది అక్కడి ప్రజల్లో ఉన్న ఇంటి అవసరాన్ని స్పష్టంగా చూపుతోంది.

48
పోచారం ప్రాజెక్టుకు గూడా ఆదరణ:
Image Credit : freepik

పోచారం ప్రాజెక్టుకు గూడా ఆదరణ:

ఇక పోచారంలోని 601 ఫ్లాట్లకు సంబంధించి కూడా విస్తృత స్పందన కనిపిస్తోంది. ఇప్పటివరకు సుమారు 800 మంది ఈ ప్రాజెక్టుపై టెలిఫోన్ ద్వారా సంప్రదించగా, 300 మంది పైగా ప్రత్యక్షంగా ప్రాజెక్టును పరిశీలించారు. ఇంటి కలను తక్కువ వ్యయంతో నెరవేర్చాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప అవకాశం అని భావించవచ్చు.

58
దరఖాస్తు తుది తేదీలు:
Image Credit : freepik

దరఖాస్తు తుది తేదీలు:

ప్రాజెక్టుల కోసం దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయనే విషయం ఆసక్తికరంగా మారింది. బండ్లగూడ ప్రాజెక్టుకు సంబంధించి దరఖాస్తులను జూలై 29వ తేదీ వరకు స్వీకరించనున్నారు. తర్వాత రోజు అంటే జూలై 30న లాటరీ ద్వారా ఫ్లాట్ కేటాయింపు జరుగుతుంది. పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన దరఖాస్తులు జూలై 31వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 1న అక్కడ లాటరీ ప్రక్రియ జరుగుతుంది.

68
ధరల్లో గొప్ప లాభం:
Image Credit : freepik

ధరల్లో గొప్ప లాభం:

ఇల్లు కొనాలనుకునే వారు ఇప్పుడు మార్కెట్ ధరలను చూస్తే తలపట్టుకుంటున్నారు. కానీ ఈ రెండు ప్రాజెక్టుల్లో లభిస్తున్న ఫ్లాట్లు మార్కెట్ రేటుతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ధరలకే అందుతున్నాయి. అంటే రూ. 60 లక్షల వరకు ఉన్న ఫ్లాట్ మార్కెట్ విలువను చూస్తే, ఇక్కడ దానికంటే కనీసం రూ. 20-25 లక్షల తక్కువకే పొందవచ్చు. ఇది సగటు ఉద్యోగి, చిన్న వ్యాపారులకు అనుకూలమైన అవకాశంగా మారింది.

78
ప్రాజెక్టుల లక్షణాలు:
Image Credit : freepik

ప్రాజెక్టుల లక్షణాలు:

ఈ రెండు ప్రాజెక్టులూ ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యినవే కావడంతో వెంటనే ప్రవేశించగలిగేలా ఉన్నాయి. అన్ని మౌలిక వసతులు – నీరు, విద్యుత్‌, డ్రైనేజ్‌, రహదారులు, పార్కింగ్ సదుపాయాలతో పాటు ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా నిర్మాణం పూర్తవ్వడం విశేషం. పైగా, TSHB ద్వారా నిర్వహించబడుతున్నందున నమ్మకంగా భావించవచ్చు.

88
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
Image Credit : freepik

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ఇంటి కోసం ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్ లేదా TS Rajiv Swagruha కార్పొరేషన్ కార్యాలయాల్లో దరఖాస్తులు పొందవచ్చు. సంబంధిత దస్త్రాలు, చెల్లించాల్సిన ఫీజు, గుర్తింపు పత్రాలు వంటివన్నీ సమర్పించి, లాటరీ ప్రక్రియలో పాల్గొనవచ్చు. విజేతల ఎంపిక తర్వాత తుది ధృవీకరణ చేసుకుని లావాదేవీ పూర్తిచేయవలసి ఉంటుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Related Stories
Recommended image1
Hyderabad: హైదరాబాద్ బెస్ట్ అంటున్న బెంగళూరు టెకీ.. ట్రాఫిక్‌కు గుడ్‌బై చెబుతూ వైరల్ పోస్ట్ !
Recommended image2
Hyderabad Metro: హైద‌రాబాద్ భ‌విష్య‌త్తును మార్చ‌నున్న మెట్రో.. ఎక్క‌డి వ‌ర‌కు విస్త‌రించ‌నుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved