- Home
- Technology
- Arattai : వాట్సాప్ కు పోటీగా స్వదేశీ మెసేజింగ్ యాప్.. అరట్టై డౌన్లోడ్ చేసేముందు ఇవి తెలుసుకొండి
Arattai : వాట్సాప్ కు పోటీగా స్వదేశీ మెసేజింగ్ యాప్.. అరట్టై డౌన్లోడ్ చేసేముందు ఇవి తెలుసుకొండి
Arattai : ఇండియన్ టెక్ దిగ్గజం జోహో వాట్సాప్ కు పోటీగా స్వదేశీ పరిజ్ఞానంతో 'అరట్టై' యాప్ ను తీసుకువచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతున్న ఈ యాప్ లోని ఫీచర్లు, కొన్ని లోపాల గురించి తెలుసుకోండి.

అరట్టై యాప్ కి పెరుగుతున్న ఆదరణ
Arattai : భారతీయ కంపెనీ జోహో విదేశీ టెక్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే గూగుల్ కు పోటీగా జోహో మెయిల్ నిలిచింది… డిజిటల్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రమోట్ చేస్తోంది. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, ధర్మేంధ్ర ప్రదాన్ వంటివారు ఇప్పటికే జోహో మెయిల్ కు మారిన విషయం తెలిసిందే. ఇలా ప్రజాదరణ కూడా పొందుతున్న జోహో సరికొత్త మెసేజింగ్ యాప్ ను తీసుకువచ్చింది… అదే అరట్టై.
ఇప్పుడు జోహో వాట్సాప్ కు పోటీగా తీసుకువచ్చిన 'అరట్టై' యాప్ ఇండియాలో పాపులర్ అవుతోంది. వాట్సాప్ లాంటివే కాదు మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది స్లో ఇంటర్నెట్‌లో కూడా బాగా పనిచేస్తుంది. ఇలాంటివి ఈ యాప్ ను మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్
ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో పనిచేసే ఈ యాప్ మరో ప్రత్యేకత కలిగివుంది. ప్రస్తుతం వాట్సాప్ ను ఉపయోగించాలంటే మొబైల్ నంబర్ అవసరం… కానీ అరట్టైలో ఎలాంటి మొబైల్ నంబర్ లేకుండా చాట్ చేయవచ్చు. ప్రత్యేక మీటింగ్స్ కూడా క్రియేట్ చేయవచ్చు.
మరిన్ని ఫీచర్లు
ఈ అరట్టై యాప్‌లో మెన్షన్స్, పాకెట్స్, స్టోరీ నోటిఫికేషన్స్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. పాకెట్స్ ఫీచర్ ముఖ్యమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను క్లౌడ్‌లో సురక్షితంగా సేవ్ చేస్తుంది. అంటే పొరపాటున డిలీట్ అయిన సమాచారాన్ని తిరిగి పొందవచ్చు.
అరట్టైలో లేని ఫీచర్లివే..
ప్రస్తుతం 'అరట్టై' యాప్‌లో కొన్ని ఫీచర్లు లేవు. చాట్‌లను లాక్ చేయడం, డిజప్పియరింగ్ మెసేజ్‌లు, చాట్ ఎక్స్‌పోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లాంటివి ఇందులో అందుబాటులో లేవు.
అరట్టై ఎక్కడ డౌన్లోడ్ చేయాలి?
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కు వెళ్లండి. "Arattai" అని సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని చాటింగ్ మొదలుపెట్టొచ్చు.