MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Technology
  • అబ్బా.. ఫస్ట్ టైమ్ యూట్యూబ్ ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై షార్ట్స్ స్క్రోలింగ్‌కు లిమిట్

అబ్బా.. ఫస్ట్ టైమ్ యూట్యూబ్ ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై షార్ట్స్ స్క్రోలింగ్‌కు లిమిట్

YouTube: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న యూట్యూబ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్‌ను తీసుకొచ్చింది. షార్ట్ వీడియోలలో ఎక్కువ సమయం గడిపే యూజర్ల కోసం ఈ కొత్త ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 24 2025, 07:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షార్ట్ వీడియోలకు రోజువారీ లిమిట్
Image Credit : Asianet News

షార్ట్ వీడియోలకు రోజువారీ లిమిట్

యూట్యూబ్ షార్ట్‌లలో ఎక్కువసేపు స్క్రోల్ చేస్తూ సమయం వృథా అవుతోందని చాలా మంది అంటుంటారు. అయినా కూడా ఈ అల‌వాటు నుంచి బ‌య‌ట‌ప‌డ‌రు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ యూజర్లు రోజులో ఎన్ని నిమిషాలు లేదా గంటలు షార్ట్‌లను చూడాలో ముందుగా సెట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. సెట్ చేసిన సమయం పూర్తయిన తర్వాత, యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఒక అలర్ట్ చూపిస్తుంది — "ఇవాళ్టి లిమిట్ పూర్తైంది" అని సూచిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎలా సెట్ చేసుకోవాలి?
Image Credit : Gemini

ఎలా సెట్ చేసుకోవాలి?

ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే, యూజర్లు తమ మొబైల్ యాప్‌లోని Settings → Time Watched → Shorts Time Limit విభాగంలోకి వెళ్లాలి. అక్కడ రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయవచ్చు. అలర్ట్ వచ్చిన తర్వాత కూడా యూజర్ అవసరమైతే దానిని తాత్కాలికంగా డిస్మిస్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ ఈ ఫీచర్ ప్రధానంగా “సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవడం” అనే లక్ష్యంతో అందిస్తోంది.

35
డిజిటల్ వెల్‌బీయింగ్ దిశగా ముందడుగు
Image Credit : Google

డిజిటల్ వెల్‌బీయింగ్ దిశగా ముందడుగు

యూట్యూబ్ ఇప్పటికే ‘Take a Break’, ‘Bedtime Reminder’ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఇవి యూజర్లు నిరంతరం వీడియోలు చూస్తూ సమయం మరిచిపోకుండా ఉండటానికి సహాయపడతాయి. ఇప్పుడు Shorts Time Limit కూడా వాటిలో చేరడంతో, డిజిటల్ వెల్‌బీయింగ్‌ (Digital Well-being) కోసం యూట్యూబ్ మరొక బలమైన అడుగు వేసినట్టే.

45
తల్లిదండ్రుల కోసం అదనపు నియంత్రణ
Image Credit : Google

తల్లిదండ్రుల కోసం అదనపు నియంత్రణ

ఈ సంవత్సరం చివరినాటికి యూట్యూబ్ Parental Controls ను విస్తరించబోతోంది. ఇందులో Shorts Feed Limit కూడా భాగంగా ఉంటుంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల లేదా టీనేజ్ అకౌంట్లలో రోజుకు ఎంతసేపు షార్ట్‌లు చూడొచ్చో కంట్రోల్ చేయగలరు. ముఖ్యంగా, పిల్లలు ఈ లిమిట్‌ను డిస్మిస్ చేయలేని విధంగా యూట్యూబ్ ఈ సదుపాయాన్ని రూపొందిస్తోంది.

55
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
Image Credit : Google

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఈ కొత్త ఫీచర్ అక్టోబర్ 22 నుంచి మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వ‌చ్చింది. తర్వాతి వారాల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా యూజర్లంద‌రికీ రోల్ అవుట్ చేయనున్నారు. ఈ అప్‌డేట్ ద్వారా యూట్యూబ్ యూజర్లలో సమయ నియంత్రణ, డిజిటల్ హెల్త్ అవేర్‌నెస్ వంటి అలవాట్లను పెంపొందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్
Recommended image2
ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఇలాంటి ఫోన్ ఏంటి భ‌య్యా.. మోడ‌ల్, ఫీచ‌ర్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Recommended image3
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా.? ఈ త‌ప్పుచేస్తే అధికారులు మీ ఇంటికి వ‌స్తారు
Recommended image2
ఫ్యామిలీ కోసం కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. ల‌క్ష‌న్న‌ర‌తో ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. EMI ఎంతంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved