MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Type-C Charger : టైప్-సి ఛార్జర్ లో 'C' కి అర్థమేంటో తెలుసా?

Type-C Charger : టైప్-సి ఛార్జర్ లో 'C' కి అర్థమేంటో తెలుసా?

ఇప్పుడు మొబైల్ ఫోన్లకు టైప్-సి చార్జర్లే ప్రామాణికం. ఫోన్లే కాదు ల్యాప్‌టాప్‌లతో సహా ఎన్నో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లలో టైప్-సి పోర్టులే వస్తున్నాయి. రోజూ వాడే ఈ టైప్-సి చార్జర్‌లో 'C'కి అర్థం ఏంటో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 18 2026, 09:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీరు టైప్ సి ఛార్జర్ వాడుతున్నారా? అసలు 'సి' అంటే ఏమిటి?
Image Credit : Getty

మీరు టైప్-సి ఛార్జర్ వాడుతున్నారా? అసలు 'సి' అంటే ఏమిటి?

Type-C Charger : ఈ రోజుల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, చివరికి ఆటబొమ్మలకు కూడా టైప్-సి చార్జింగే కామన్ అయిపోయింది. ప్రతిరోజు కోట్లాదిమంది ఈ చార్జర్ ను వాడుతుంటారు... కానీ చాలామందికి టైప్-సి లో 'సి' కి అర్థం ఏమిటో తెలియదు. నిజానికి టైప్-సిలోని 'C' అక్షరానికి ఎలాంటి పూర్తి రూపం (ఫుల్ ఫామ్) లేదు. ఇది చార్జింగ్ టెక్నాలజీలో మూడో తరం… అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీనికంటే ముందు టైప్-ఎ, టైప్-బి చార్జర్లు వాటి తరం, ఆకారం ఆధారంగా పేర్లు పొందాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రపంచవ్యాప్తంగా టైప్-సి దే హవా
Image Credit : Getty

ప్రపంచవ్యాప్తంగా టైప్-సి దే హవా

గతంలో టైప్-ఎ, టైప్-బి అనే రెండు తరాల చార్జర్స్ ఉండేవి... ప్రపంచంవ్యాప్తంగా వీటినే ఉపయోగించేవారు. అయితే టెక్నాలజీ డెెవలప్ అయ్యాక ఈ టైప్-ఎ, టైప్-బి ఛార్జర్లలో సమస్యలను పరిష్కరించడానికే టైప్-సిని డిజైన్ చేశారు. ఇది కేవలం మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకే కాదు అనేక ఎలక్ట్రిక్ వస్తువుల ఛార్జింగ్ కు ఉపయోగపడుతోంది. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ టైప్-సి ఛార్జర్ ని విరివిగా వాడుతున్నారు.

Related Articles

Related image1
Phone Charging: నైట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి పడుకునే అలవాటు మీకు ఉందా? జరిగేది ఇదే
Related image2
Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
35
టైప్-ఎ, టైప్-బి ఛార్జర్స్ కంటే టైప్-సి ఎందుకు బెటర్?
Image Credit : Getty

టైప్-ఎ, టైప్-బి ఛార్జర్స్ కంటే టైప్-సి ఎందుకు బెటర్?

టైప్-ఎ, టైప్-బి చార్జర్లతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాటిని సరైన దిశలోనే పోర్టులో పెట్టాలి. రివర్స్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తే పోర్ట్ లేదా కేబుల్ పాడయ్యేది. ఈ సమస్యను అధిగమించడానికే టైప్-సి వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్లగ్ చేయొచ్చు. కాలక్రమేణా చార్జింగ్ ప్రమాణాలు ఎంత మారుతున్నా టైప్-సి పోర్ట్ ఆకారాన్నే అందరూ ఫాలో అవుతున్నారు.

45
టైప్-సి ఛార్జర్ తో లాభాలివే..
Image Credit : Getty

టైప్-సి ఛార్జర్ తో లాభాలివే..

టైప్-సి పోర్ట్‌తో కేవలం రివర్స్‌లో పెట్టే సమస్య తీరడమే కాదు చాలా ప్రయోజనాలున్నాయి. పాత చార్జర్లతో పోలిస్తే ఇది ఎక్కువ పవర్‌ను అందిస్తుంది. దీని ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ (10 Gbps వరకు). ఫోన్ చార్జింగే కాకుండా, మానిటర్లు, టీవీలు వంటి ఇతర పరికరాలను కూడా దీనితో కనెక్ట్ చేయవచ్చు.

55
టైప్-డి ఛార్జర్ వస్తుందా?
Image Credit : Getty

టైప్-డి ఛార్జర్ వస్తుందా?

ప్రస్తుతానికి టైప్-సి తర్వాత టైప్-డి వంటి టెక్నాలజీ వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ చట్టం ప్రకారం టైప్-సిని అధికారిక చార్జింగ్ ప్రమాణంగా మార్చారు. అంతేకాదు టైప్-సి టెక్నాలజీని నిరంతరం మెరుగుపరుస్తున్నారు. సైజు అదే ఉన్నా దాని వేగం, ఫీచర్లు పెరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా టైప్-సి పోర్టే కొనసాగనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest 5G Plan : రూ.200 లోపే 5G డేటా.. జియో, ఎయిర్‌టెల్, Viలో చౌక రీఛార్జ్ ప్లాన్ ఎవరిది?
Recommended image2
Best Smartphones Under 20K : రూ.20 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.. గేమర్స్, క్రియేటర్స్ కోసం టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే !
Recommended image3
Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
Related Stories
Recommended image1
Phone Charging: నైట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి పడుకునే అలవాటు మీకు ఉందా? జరిగేది ఇదే
Recommended image2
Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved