బ్యాన్ చేసిన తగ్గేదేలే.. ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా మళ్ళీ టిక్‌టాక్..
చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్(TikTok) ను భారతదేశంలో నిషేధించిన సంగతి మీకు తెల్సిందే. అమెరికా, పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా ఈ యాప్ నిషేధించబడినప్పటికీ, తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. టిక్‌టాక్ ప్రారంభం నుండి చాలా వైరల్ యాప్. దాని గురించి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు.
టిక్‌టాక్ 2021 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మొబైల్ యాప్‌గా అవతరించింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లను అధిగమించి
2021లో గ్లోబల్ డౌన్‌లోడ్‌లలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ వంటి ప్రముఖ యాప్‌లను కూడా టిక్‌టాక్ అధిగమించింది, అయితే వినోదం కేటగిరీలో నెట్‌ఫ్లిక్స్అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్ గా ఉంది. అయితే షాపింగ్ కేటగిరీలో షాపీ ప్రపంచవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనబరిచింది. మరోవైపు అమెరికాలో షాపింగ్ విభాగంలో అమెజాన్ అగ్రస్థానంలో ఉంది. గూగుల్ మ్యాప్స్ ట్రావెల్ యాప్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది, అయితే స్పోటిఫి (Spotify)మ్యూజిక్ అండ్ ఆడియో విభాగంలో జెండా ఎగురవేసింది. ఈ సమాచారం Apptopia నివేదిక నుండి స్వీకరించబడింది.
2021లో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన టాప్ 10 సోషల్ మీడియా యాప్‌లు
టిక్‌టాక్ (656 మిలియన్లు)
ఇన్‌స్టాగ్రామ్ (545 మిలియన్లు)
ఫేస్ బుక్ (416 మిలియన్లు)
వాట్సప్ (395 మిలియన్లు)
టెలిగ్రామ్ (329 మిలియన్)
స్నాప్‌చాట్ (327 మిలియన్)
జూమ్ (300 మిలియన్)
స్పాటిఫై (203 మిలియన్)
సబ్‌వే సర్ఫర్ (191 మిలియన్)
రోలోక్స్ (182 మిలియన్)
2021లో ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన్ టాప్ 10 గేమ్ యాప్‌లు
సబ్‌వే సర్ఫర్ (191 మిలియన్)
రోబ్లక్స్ (182 మిలియన్)
బ్రిడ్జ్ రేస్ (169 మిలియన్)
గారెనా ఫ్రీ ఫైర్ (154 మిలియన్లు)
ఏమంగ్ అస్ (152 మిలియన్లు)
హెయిర్ ఛాలెంజ్ (138 మిలియన్లు)
జాయిన్ క్లాష్ (136 మిలియన్లు)
8 బాల్ పూల్ (130 మిలియన్లు)
లూడో కింగ్ (125 మిలియన్)
కాండీ క్రష్ సాగా (119 మిలియన్)