భారీ బ్యాటరీతో అతి తక్కువ ధరకే కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..
టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా 2ను ఫిలిప్పీన్స్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గత ఏడాది డిసెంబర్ భారతదేశంలో లాంచ్ చేసిన టెక్నో పోవాకి అప్‌గ్రేడ్ వెర్షన్. లేటెస్ట్ డిస్‌ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా వంటి కొత్త మార్పులతో టెక్నో పోవా 2ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెక్నో పోవా 2కి మీడియా టెక్ హెలియో జి85 ప్రాసెసర్‌తో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
టెక్నో పోవా 2 గురించి...
టెక్నో పోవా 2 ధర ఫిలిప్పీన్స్ లో 7,990 ఫిలిప్పీన్ పెసో అంటే సుమారు రూ.12,200. ఈ ధర వద్ద 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సేల్స్ జూన్ 11 నుండి బ్లాక్, బ్లూ, సిల్వర్ రంగులలో లభిస్తుంది. రేపటి నుండి అంటే జూన్ 5 నుండి ప్రీ-బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. ఇండియలో ఈ ఫోన్ లభ్యతపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
టెక్నో పోవా 2
టెక్నో పోవా 2లో ఆండ్రాయిడ్ 11 ఇచ్చారు. అంతేకాకుండా 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ ప్లే స్టయిల్ పంచ్ హోల్. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ఇచ్చారు. వీటిని మెమరీ కార్డ్ సహాయంతో మరింత విస్తరించూకొవచ్చు.
టెక్నో పోవా 2 కెమెరా
ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు. ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్. ప్రస్తుతం మిగతా మూడు లెన్స్‌ల గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సపోర్ట్ తో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
టెక్నో పోవా 2 బ్యాటరీ
టెక్నో పోవా 2లో భారీ 7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ రెండు రోజులుగా క్లెయిమ్ చేయబడింది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. గేమింగ్ కోసం సంస్థ టర్బో 2.0ను ఇచ్చింది.