ఫాస్ట్ 5జి నెట్‌వర్క్‌తో వన్‌ప్లస్‌కి పోటీగా సామ్‌సంగ్ చౌకైనా 5జి స్మార్ట్‌ఫోన్.. దీని టాప్ ఫీచర్స్ ఇవే..
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ భారతదేశంలో గెలాక్సీ సిరీస్ కింద కొత్తగా గెలాక్సీ ఎ22 5జి స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జి సంస్థ నుండి వస్తున్న చౌకైనా 5జి స్మార్ట్‌ఫోన్. సామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో నాచ్ స్టయిల్ డిస్ ప్లే ఇచ్చారు.
ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్, 8 జీబీ ర్యామ్ అందించారు. అలాగే డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. 11 5జి బ్యాండ్‌లు కూడా ఫోన్‌లో ఇచ్చారు, తద్వారా మీరు 5జి నెట్‌వర్క్‌లో వేగవంతమైన స్పీడ్ పొందుతారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జి రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్, రియల్‌మీ ఎక్స్7 5జి, ఐక్యూ జెడ్3లతో పోటీ పడనుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ22 5జి 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ 19.999. 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ ఫోన్‌ను గ్రే, మింట్ అండ్ వైలెట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ రిటైల్ స్టోర్ నుండి జూలై 25 నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు రాత్రి నుండి ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి కార్డుతో 1,500 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జిలో ఆండ్రాయిడ్ 11 బేస్డ్ వన్ యుఐ కోర్ 3.1 ఇచ్చారు. ఈ ఫోన్ కి 6.6-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఇన్ఫినిటీ వి డిస్ ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు లభిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.
ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తుంది. దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్, ముందు వైపు సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జి కనేక్టివిటీలో 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ22 5జికి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది, అలాగే 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.