మేడ్ ఇన్ ఇండియా: స్ట్రాంగ్ బ్యాటరీతో లావా జెడ్2ఎస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరకే బెస్ట్ ఫీచర్స్
దేశీయ సంస్థ లావా జెడ్ సిరీస్ కింద ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా జెడ్2ఎస్ 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. డిస్ ప్లే కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. లావా జెడ్2ఎస్ 5000mAh బలమైన బ్యాటరీతో వస్తుంది. లావా జెడ్ సిరీస్‌లో వస్తున్న ఈ ఫోన్ మూడో స్మార్ట్‌ఫోన్. ఇంతకు ముందు లావా జెడ్ 2, లావా జెడ్ 2 మాక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేశారు.
లావా జెడ్ 2ఎస్ ని సింగిల్ వేరియంట్ 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్‌లో ప్రవేశపెట్టారు. దీని ధర రూ .7,299, అయితే లాంచింగ్ ఆఫర్ కింద కంపెనీ వెబ్‌సైట్ అండ్ అమెజాన్ నుండి రూ .7,099 కు కొనుగోలు చేయవచ్చు. లావా జెడ్ 2ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ .7,999కు కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ను స్ట్రిప్డ్ బ్లూ కలర్‌లో అందిస్తుంది. అంతేకాకుండా 100 రోజుల స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వారంటీతో వస్తుంది.
లావా జెడ్2ఎస్ లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ అందించారు. దీనికి 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లేతో 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ ప్లేకి 2.5 డి కర్వ్ స్క్రీన్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఫోన్‌లో మీడియాటెక్ హెలియో ప్రాసెసర్ ఇచ్చారు. 2జిబి డిడిఆర్4ఎక్స్ ర్యామ్, 32 జిబి స్టోరేజ్ లభిస్తుంది, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 512 జిబి వరకు విస్తరించుకోవచ్చు.
లావా జెడ్ 2ఎస్ లో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని వెనుక ప్యానెల్‌లో బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్ మోడ్, నైట్ మోడ్ అండ్ పోర్ట్రెయిట్ మోడ్‌తో 8 మెగాపిక్సెల్ ఎఫ్/2.0 ఎపర్చరు కెమెరా ఉంది. ఫోన్‌లో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.
లావా జెడ్2ఎస్ కనెక్టివిటీ ఆప్షన్స్ లో వై-ఫై 802.11 బి/జి/ఎన్, ఎల్‌టిఈ, బ్లూటూత్ వి5, యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ బరువు 190 గ్రాములు. దీనిలో భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.