Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇప్పుడు డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..

రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇప్పుడు డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ..

భారత దేశ అతి పెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో  కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రారంభ ధర రూ .499. ఓ‌టి‌టి యాప్‌లకు సబ్‌స్క్రైబ్ చేయాలనుకునే కస్టమర్ల కోసం జియో ఈ ప్లాన్‌ను ప్రారంభించింది.

asianet news telugu | Asianet News | Published : Aug 31 2021, 06:14 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

 ఈ జియో ప్లాన్‌లన్నీ ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. అలాగే ఈ ప్లాన్ తో ఆన్ లిమిటెడ్ కాల్స్, డాటా, ఎస్‌ఎం‌ఎస్, జియో యాప్స్ అండ్ ఇతర పొందుతారు. సెప్టెంబర్ 1 నుండి ఈ ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి. 

ఈ కొత్త ప్లాన్ల ద్వారా డిస్నీ + హాట్‌స్టార్  కంటెంట్ లైబ్రరీలో ఇంగ్లిష్ భాషలో ఇంటెర్నేషనల్ కంటెంట్,  డిస్నీ + ఒరిజినల్స్, డిస్నీ టి‌వి షోస్, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్‌బి‌ఓ, ఎఫ్‌ఎక్స్, షో టైం ఇంకా మరెన్నో ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది. 
 

23
Asianet Image

జియో  రూ .499 ప్లాన్
 ఈ కొత్త రూ .499 ప్లాన్‌ వాలిడిటీ  28 రోజులు. ఇందులో ప్రతిరోజూ 3జి‌బి డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, మెసేజింగ్, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

జియో రూ .666 ప్లాన్
ఈ ప్లాన్ తో పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,  వాలిడిటీ 56 రోజులు, ప్రతిరోజూ 2జి‌బి డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, మెసేజింగ్ లభిస్తాయి.

 జియో రూ. 888 ప్లాన్
 ఈ ప్లాన్ తో పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌, వాలిడిటీ 84 రోజులు,  ప్రతిరోజూ 2జి‌బి డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, మెసేజింగ్  లభిస్తాయి.

33
Asianet Image

జియో  రూ.2,599 ప్లాన్ 
ఈ ప్లాన్  వాలిడిటీ 365 రోజులు, ప్రతిరోజూ 2జి‌బి డేటా లభిస్తుంది. ఇందులో కూడా డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఆన్ లిమిటెడ్ కాలింగ్, మెసేజింగ్ చేసుకోవచ్చు.

జియో  రూ .549 ప్లాన్
జియో రూ .549 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది, ఈ ప్లాన్  డాటా యాడ్ ఆన్ ప్లాన్. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 56 రోజులు.
 

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories