ఐఫోన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే
ఐఫోన్ 16 సిరీస్ (ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్) సెప్టెంబరులో విడుదల అవుతుందని అంచనా. కానీ, యాపిల్ నూతన AI ఫీచర్ల కారణంగా లాంచ్ డేట్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.
iphone 16
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను కలిగి ఉండే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ సమీపిస్తోంది. సెప్టెంబరు మాసం ప్రారంభంలోని 16 సిరీస్‌ను యాపిల్ లాంచ్ చేస్తుందని గతంలో Apple విడుదల తేదీలను పరిశీలిస్తే తెలుస్తుంది. గత సంవత్సరం ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12వ తేదీన ఆవిష్కరించింది. ఒక వారం తర్వాత 16 సిరీస్ ఐఫోన్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్‌లోపు కూడా అందుబాటులోకి రావచ్చని అంచనా.
iphone 16
అయితే, ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ డేట్‌పై కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. iPhone అందించే ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ల గురించి విస్తృతమైన ఊహాగానాలు మొదలయ్యాయి.
iphone 16 series launch
ఐఫోన్ ప్రియులు ఐఫోన్ 16 సిరీస్ విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లను ఆపిల్ సెప్టెంబర్‌లో లాంచ్ చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది.
iPhone 16
యాపిల్ కృత్రిమ మేధస్సు వ్యవస్థ, యాపిల్ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకు iPhone 16 సిరీస్‌లో అత్యుత్తమ ఫీచర్‌గా భావిస్తున్నారు. దీని కారణంగా ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు వేగంగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ తాజా సూచనల ప్రకారం, iPhone 16 సిరీస్‌ను ప్రారంభించాలని అందరూ భావించే సమయానికి ఐఫోన్ కొత్త సిరీస్‌లో Apple ఇంటిలిజెన్స్ సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదట. యాపిల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా సిద్ధమయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని సమాచారం. ఆపిల్ ఇంటెలిజెన్స్‌లోని బగ్‌లు ఇంకా పరిష్కరించాల్సి ఉందట. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Apple intelligence
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ ఆపరేషన్‌ను మరింత సరళంగా, సృజనాత్మకంగా చేస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంగ్ ఫామ్ ఆర్టికల్స్ రాయడం, ఇమెయిల్‌లను సృష్టించడం, సంగ్రహించడం సులభతరం చేస్తుంది. అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా మీరు రాయాలనుకున్నది రాయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఎమోజీలను సృష్టించడం, ఫొటోలను ఎడిట్ చేయడం పనులు ఈజీ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Apple AI
అలాగే, థర్డ్-పార్టీ యాప్‌లు కూడా Apple ఇంటిలిజెన్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్రయోజనం కోసం ఆపిల్ ప్రవేశపెట్టిన ప్రత్యేక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది Apple వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ప్రధాన థీమ్ ఉత్పాదక AIకి సంబంధించిన ప్రకటనలు.