హార్ట్ రేట్ మానిటరింగ్, టచ్ సపోర్ట్‌తో పోర్ట్రానిక్స్ కొత్త స్మార్ట్ వాచ్.. అందిస్తున్న అట్రక్టివ్ ఫీచర్స్ ఇవే
ఇండియన్ బ్రాండ్ పోర్ట్రానిక్స్ కొత్త స్మార్ట్ వాచ్ పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటాను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ తో ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇంకా 100 వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది.
అంతేకాకుండా పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటాలో ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆప్షన్ కూడా ఉంది. దీని కోసం ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇచ్చారు. పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటా స్మార్ట్‌వాచ్‌ను బ్లాక్, గ్రే అండ్ రోజ్ పింక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.3,999. దీనిని పోర్ట్రానిక్స్ వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్ పోర్టల్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ భారతదేశంలోని ఎంఐ, రెడ్‌మి, అమేజ్‌ఫిట్, ఫైర్‌బోల్ట్ వంటి సంస్థల స్మార్ట్‌వాచ్‌లతో పోటీ పడనుంది.
పోర్ట్రానిక్స్ క్రోనోస్ బీటా వాచ్ టచ్ సపోర్ట్‌తో పాటు 1.28-అంగుళాల టిఎఫ్‌టి రౌండ్ డిస్ ప్లే ఉంటుంది. ఈ వాచ్ లో 512ఎంబి స్టోరేజ్ ఉంది, ఇందులో 300 పాటలు స్టోర్ చేయవచ్చు. ఇంకా 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, రన్నింగ్, వాకింగ్, స్టెప్స్ సహా 10 స్పోర్ట్స్ మోడ్‌లు లభిస్తాయి.
పోర్ట్రానిక్స్ 100 వాచ్ ఫేస్‌లతో వస్తుంది. అంతే కాకుండా మీరు మీ స్వంత వాచ్ ఫేస్‌లను కంపానియన్ యాప్ ద్వారా కూడా సృష్టించవచ్చు. దీనిలో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.1, వాటర్ రిసిస్టంట్ కోసం దీనికి IP68 రేటింగ్ లభించింది. ఈ వాచ్ బాడీ అల్యూమినియం ఇంకా పాలికార్బోనేట్‌తో తయారవుతుంది. దీనిలో 240mAh బ్యాటరీ ఇచ్చారు అలాగే ఏడు రోజుల క్లెయిమ్ బ్యాకప్‌తో వస్తుంది.