MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • kitchen gadgets: వంటగదికి అవసరమైన అద్భుతమైన కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవిగో, ధర చాలా తక్కువ

kitchen gadgets: వంటగదికి అవసరమైన అద్భుతమైన కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవిగో, ధర చాలా తక్కువ

kitchen gadgets: రోజువారీ వంటగది పనులు అంటే చాలా మందికి కష్టమైన పనే. ముఖ్యంగా పనిచేసే మహిళలకు (Working Women) వంట సమయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. వంటగది పనులను చిటికెలో పూర్తి చేయడానికి కొన్ని ఆధునిక గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 16 2026, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మల్టీ కుక్కర్ (Multi Cooker / Electric Kettle)
Image Credit : Asianet News

మల్టీ కుక్కర్ (Multi Cooker / Electric Kettle)

ఇది వంటగదిలో అత్యంత ఉపయోగకరమైన గ్యాడ్జెట్‌లలో ఒకటి. దీనిని కేటిల్ లాగా నీళ్లు మరిగించుకోవడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు, గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు, మ్యాగీ లేదా కొద్దిపాటి అన్నం కూడా వండుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. కేవలం 5 నిమిషాల్లో గుడ్లు ఉడికిపోవడం దీని ప్రత్యేకత. ఈ మల్టీ కుక్కర్ ఆన్ లైన్ లో 800 నుంచి దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పోర్టబుల్ బటర్ మిల్క్ షేకర్ / జ్యూసర్ (Portable Milk/Juice Shaker)
Image Credit : Asianet News

పోర్టబుల్ బటర్ మిల్క్ షేకర్ / జ్యూసర్ (Portable Milk/Juice Shaker)

ఎండాకాలంలో మజ్జిగ లేదా తాజా జ్యూస్‌లు తయారు చేసుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కావలసిన పదార్థాలు, పెరుగు, నీరు, తగినంత ఉప్పు లేదా పుదీనా, అల్లం వేసుకుని బాగా షేక్ చేయవచ్చు. ఇది ఎయిర్-లాక్ సిస్టమ్‌తో వస్తుంది కాబట్టి పొరపాటున కింద పడిపోయినా నీరు బయటకు రాదు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దీన్ని సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు. ఈ మిల్క్ షేకర్ ఆన్ లైన్ లో దొరుకుతుంది.. 300 రూపాయల నుంచి అందుబాటులో ఉంది.

గ్రేటర్ కమ్ స్టోరేజ్ బాక్స్ (Greater with Storage Box)

కూరగాయలు లేదా కొబ్బరి తురుముకోవడానికి సాధారణ గ్రేటర్లు వాడతాం, కానీ తురిమిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి మార్చాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రేటర్‌కు కిందనే ఒక స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. క్యారెట్ లేదా కొబ్బరి తురుముకున్నాక నేరుగా మూతపెట్టి ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ కనుక ఆహారం ఎక్కువ కాలం తాజా ఉంటుంది. ఈ గ్రేటర్ కమ్ స్టోరేజ్ బాక్స్ లు రకరకాల ధరలలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. 200 నుంచి మొదలై.. అందులో ఫీచర్స్ ను బట్టి రేట్లు పెరుగుతుంటాయి

33
మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ బ్లెండర్ - చాపర్ (Electric Blender & Chopper)
Image Credit : Hyderabadi Ruchulu YouTube Channel

మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ బ్లెండర్ - చాపర్ (Electric Blender & Chopper)

ఇది మల్టీపర్పస్ మిషన్‌గా పనిచేస్తుంది. దీని సహాయంతో కేవలం 5 నిమిషాల్లో సులభంగా మీగడ నుంచి వెన్న తీసుకోవచ్చు. అలాగే ఎగ్స్ బీట్ చేసుకోవడానికి, పిండి కలుపుకోవడానికి , కూరగాయలను చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిక్ విధానం ద్వారా వంటపనులు మరింత వేగంగా పూర్తవుతాయి. ఈ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ బ్లెండర్ కమ్ చాపర్ 1000 రూపాయల ధరలో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. మరిన్ని ఫీచర్స్ తో కావాలన్నీ ఆప్షన్స్ చూసుకోవచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Recommended image2
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
Recommended image3
Earbuds : ఇయర్‌బడ్స్‌ ఎలా క్లీన్ చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి?
Related Stories
Recommended image1
గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్‌, యాక్టర్‌గా సక్సెస్
Recommended image2
90s Biscuits: పార్లే-జీ నుంచి లిటిల్ హార్ట్స్ వరకు.. 90s కిడ్స్ ఎంతో ఫేవరెట్ బిస్కెట్స్ ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved