గూగుల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్..త్వరలోనే ఈ సర్వీస్ నిలిచిపోనుంది..
మీరు గూగుల్ క్రోమ్ బుక్‌మార్క్‌లను ఉపయోగిస్తున్నారా.... అయితే మీకో బ్యాడ్ న్యూస్. గూగుల్ బుక్‌మార్క్ సర్వీస్ 30 సెప్టెంబర్ 2021న నిలిచిపోనుంది. గూగుల్ బుక్‌మార్క్‌లు 2005లో ప్రారంభించారు. దీనిని ఇప్పటికీ ఎంతో మంది ఉపయోగిస్తున్నారు.
గూగుల్ బుక్‌మార్క్‌లు క్రోమ్ బ్రౌజర్ బుక్‌మార్క్ కాదని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. గూగుల్ బుక్‌మార్క్‌ల డొమైన్ www.google.com/bookmarks మీరు ఈ డొమైన్‌ను సందర్శించిన వెంటనే, 'గూగుల్ బుక్‌మార్క్‌లు 2021 సెప్టెంబర్ 30 తర్వాత మూసివేయబడతాయి. మీ బుక్‌మార్క్‌లను సేవ్ చేయడానికి ఎక్స్పొర్ట్స్ బుక్‌మార్క్‌పై క్లిక్ చేయండి. '
బుక్‌మార్క్‌లలో సేవ్ చేసిన బుక్‌మార్క్‌లు, లింక్‌లు, నోట్స్ ఏ ఇతర డివైజెస్లోనైనా యాక్సెస్ చేయవచ్చు. వీటిని చాలా వరకు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఉపయోగించవచ్చు. మరోవైపు బుక్ మార్క్ సర్వీస్ నిలిపివేత గూగుల్ మ్యాప్స్‌పై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్‌లో సేవ్ చేసిన లొకేషన్ బుక్‌మార్క్ మూసివేతతో ముగుస్తుంది.
మీ బుక్‌మార్క్‌లను ఎలా సేవ్ చేయాలంటే
మొదట google.com/bookmarks కు వెళ్లండి
అక్కడ మీరు మీ బుక్‌మార్క్‌లను చూస్తారు
ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ బుక్‌మార్క్‌ల ఆప్షన్ చూస్తారు
దీనిపై క్లిక్ చేస్తే మీరు మీ బుక్‌మార్క్‌లను వేరే ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు.