మీరు ఏదయినా యాప్ లేదా అకౌంట్ పాస్ వర్డ్ మర్చిపోయారా..? ఈజీగా కనిపెట్టే సూపర్ ట్రిక్
మీ ఫోన్ లోని సోషల్ మీడియా అకౌంట్ లేదా యాప్ పాస్‌వర్డ్స్ మర్చిపోయారా? కొన్ని సింపుల్ స్టెప్స్ తో ఎలా కనిపెట్టవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

మీ ఫోన్ ను మరింత స్మార్ట్ గా వాడే ట్రిక్
ఈ టెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ లేనివారు చాలా తక్కువనే చెప్పాలి. కేవలం ఒక్క భారతదేశంలోనే 100 కోట్లకు పైగా ఫోన్లు ఉంటాయంటేనే అర్థం చేసుకోవచ్చే వీటి వినియోగం ఏ స్థాయిలో ఉందో. ఒకప్పుడు కనీస నిత్యావసరాలు అంటే కూడు, గూడు, బట్టలు... ఇప్పుడు వీటిలో సెల్ ఫోన్ కూడా చేరింది. అయితే చాలామంది సెల్ ఫోన్ వాడతారు... కానీ అందులోని కొన్ని ఫీచర్లు తెలియవు. ఇలా స్మార్ట్ ఫోన్ లో మనకు ఉపయోగపడే ఓ ఫీచర్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఫోన్ లోని అద్భుతమైన ఫీచర్ మీకు తెలుసా?
మనం వాడే ఫోన్ లో చాలా సీక్రేట్ ఫీచర్లు ఉంటాయి. వీటిగురించి తెలుసుకుంటే కొన్నిసార్లు మన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇలా మనం ఫోన్ లో చాలా యాప్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, జిమెయిల్ వంటివి వాడుతుంటాం... అయితే కొన్నిసార్లు పాస్వర్డ్స్ మరిచిపోతుంటాం. ఈ సమయంలో కంగారుపడిపోవాల్సిన అవసరం లేదు... మన ఫోన్ లోనే మర్చిపోయిన పాస్ వర్డ్స్ ను తెలుసుకోవచ్చు. ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
సేవ్ చేసిన పాస్‌వర్డ్స్ ఎక్కడ?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, జీమెయిల్ లాంటి యాప్స్ అందరి ఫోన్స్‌లో ఉంటాయి. ఆటోమేటిక్ లాగిన్ వల్ల చాలామంది పాస్‌వర్డ్ మర్చిపోతారు. డేటా పోతే లేదా వేరే ఫోన్‌లో లాగిన్ అవ్వాలంటే పాస్‌వర్డ్ కావాలి. పాస్‌వర్డ్స్ మీ ఫోన్‌లో సేవ్ అయ్యి ఉంటాయి. ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
మీ ఫోన్ లో మర్చిపోయిన పాస్‌వర్డ్స్ ఎలా చూడాలి?
మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్స్ చూడటానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
'సెట్టింగ్స్' ఓపెన్ చేయండి.
కిందకి స్క్రోల్ చేసి 'Google' మీద క్లిక్ చేయండి.
'Google సర్వీసెస్' మీద క్లిక్ చేయండి.
'All Services' సెలెక్ట్ చేయండి.
'Autofill with Google' సెలెక్ట్ చేయండి.
'Google Password Manager' సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు మీ ఫోన్‌లో లాగిన్ అయిన అన్ని యాప్స్ కనిపిస్తాయి.
మీకు కావాల్సిన యాప్ మీద క్లిక్ చేయండి.
మీ ఫింగర్‌ప్రింట్ లేదా ఫోన్ పాస్‌వర్డ్‌తో యాప్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ చూడొచ్చు. ఇంతే ఈజీగా మర్చిపోయిన పాస్‌వర్డ్స్ చూసేయొచ్చు.