ఫ్లిప్ కార్ట్ వెబ్‌సైట్, యాప్ డౌన్.. 2022లో మొదటి సర్వీస్ డౌన్ అంటూ యూజర్ల ట్రోల్స్..
ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) వెబ్‌సైట్ అండ్ యాప్ వెర్షన్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినియోగదారులు సమస్యలను ఎదురుకొంటున్నట్లు నివేదించారు. కొందరికి ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలో "సమ్‌థింగ్ ఈజ్ నాట్ ఓకే! ప్లీజ్ ట్రై అగైన్" అనే మెసేజ్ చూపిస్తుండగా, మరికొందరికి ఆర్డర్ అండ్ లావాదేవీల హిస్టరీ యాక్సెస్ చేయలేకపోతున్నట్లు తెలిపారు.
downdetector.com ప్రకారం, చాలా మంది వెబ్‌సైట్ వినియోగదారులు (58 శాతం), అలాగే యాప్ వినియోగదారులు (24 శాతం), ఆర్డర్ హిస్టరీ ట్రాక్ చేయడానికి యాప్‌ని ఉపయోగించిన వారు (17 శాతం) అంతరాయాన్ని నివేదించారు.
వినియోగదారుల గగ్గోలు
downdetector.com సైట్‌లోని హీట్ మ్యాప్ ప్రకారం ఢిల్లీ, లక్నో, చండీగఢ్, జైపూర్, పాట్నా, కోల్‌కతా, కటక్, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌లోని వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌కు అక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ సమస్యను నివేదించారు. ఒక వినియోగదారు మాట్లాడుతూ, “ఫ్లిప్‌కార్ట్ సర్వర్ డౌన్‌లో ఉంది, వెబ్‌సైట్ అండ్ యాప్‌పై కూడా ప్రభావం చూపుతోంది. వీలైనంత త్వరగా దాన్ని సరిచేయండి." అని తెలపాగా, మరొక వినియోగదారు ఫ్లిప్‌కార్ట్ ఎరర్ పేజ్ స్క్రీన్‌షాట్‌ను చెర్ చేస్తూ సైట్ అందుబాటులో లేదని వ్యక్తం చేశారు.
ఫ్లిప్‌కార్ట్ యాప్ అండ్ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు తమ నిరాశను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “నేను ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ యాప్‌లో దేనిని సెర్చ్ చేయలేకపోతున్న ఇంకా “సంథింగ్ వెంట్ రాంగ్ అంటూ కంటెంట్ చూపించట్లేదు”అని చెప్పారు. మరో వినియోగదారుడు ట్వీట్ చేస్తూ “రిట్రై బటన్‌ను నొక్కమని చూపిస్తూందని" అన్నారు.
కార్తిక్ పటేల్ అనే మరో వినియోగదారుడు ట్వీట్ చేస్తూ, “ఇది 2022లో మొదటి సర్వీస్ డౌన్. ఫ్లిప్‌కార్ట్‌లో టెక్నికల్ సమస్య, ఇది నా ఫోన్‌లో మాత్రమేనా ఇంకెవరైనా ఇలాగే బాధపడుతున్నారా??” అంటూ పోస్ట్ చేశారు.