MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Apple AI Smart Glasses : ఆపిల్ నుంచి అదిరిపోయే AI స్మార్ట్ గ్లాసెస్.. డిజైన్, కెమెరా లీక్! పూర్తి వివరాలు ఇవే

Apple AI Smart Glasses : ఆపిల్ నుంచి అదిరిపోయే AI స్మార్ట్ గ్లాసెస్.. డిజైన్, కెమెరా లీక్! పూర్తి వివరాలు ఇవే

Apple AI Smart Glasses : ఆపిల్ కొత్త ఐఏ స్మార్ట్ గ్లాసెస్ లీక్ అయ్యాయి. ఈ ఏడాదిలోనే లాంచ్ కానున్న ఈ గ్లాసెస్ డిజైన్, కెమెరా, అదిరిపోయే ఫీచర్ల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారియి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 27 2026, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆపిల్ నుంచి కొత్త ప్రోడక్ట్.. ఐఫోన్ అవసరం లేకుండానే అన్ని పనులు చేసే గ్లాసెస్ !
Image Credit : Gemini

ఆపిల్ నుంచి కొత్త ప్రోడక్ట్.. ఐఫోన్ అవసరం లేకుండానే అన్ని పనులు చేసే గ్లాసెస్ !

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారుల కోసం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్ హవా నడుస్తుండటంతో, వాటికి గట్టి పోటీ ఇచ్చేలా ఆపిల్ తన సొంత ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ను రూపొందిస్తోంది. 2026 లేదా 2027 నాటికి ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తాజా లీక్స్ వెల్లడిస్తున్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఉండబోయే డిజైన్లు, కెమెరా ఫీచర్లు, ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విభిన్న డిజైన్లలో ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్
Image Credit : AI Generated

విభిన్న డిజైన్లలో ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్

ఆపిల్ తన స్మార్ట్ గ్లాసెస్‌ను అందరికీ నచ్చేలా రకరకాల డిజైన్లలో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం.. కంపెనీ మొత్తం నాలుగు రకాల ఫ్రేమ్ స్టైల్స్‌ను పరీక్షిస్తోంది. ఇందులో పెద్ద రెక్టాంగులర్ ఫ్రేమ్‌లు, స్లిమ్ రెక్టాంగులర్ ఫ్రేమ్‌లు ఉండనున్నాయి. అంతేకాకుండా, పెద్ద, చిన్న ఓవల్ షేప్ ఫ్రేమ్‌లను కూడా ఆపిల్ డిజైన్ చేస్తోంది. వినియోగదారులు తమ ముఖ కవళికలకు తగ్గట్టుగా నచ్చిన ఫ్రేమ్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఆపిల్ కల్పిస్తోంది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, బ్లాక్, ఓషన్ బ్లూ, లైట్ బ్రౌన్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇవి లభించనున్నాయి.

35
నాణ్యమైన మెటీరియల్‌తో తయారీ
Image Credit : Gemini

నాణ్యమైన మెటీరియల్‌తో తయారీ

బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ గ్లాసెస్ తయారీలో ఆపిల్ నాణ్యమైన ఎసిటేట్ మెటీరియల్‌ను వాడుతోంది. సాధారణ ప్లాస్టిక్ ఫ్రేమ్‌ల కంటే ఇవి చాలా బలంగా, మన్నికగా ఉంటాయని సమాచారం. లగ్జరీ లుక్‌తో పాటు రోజువారీ వినియోగానికి ఇబ్బంది లేకుండా వీటిని డిజైన్ చేస్తున్నారు.

ప్రత్యేకమైన వర్టికల్ ఓవల్ కెమెరా

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దాని కెమెరా సెటప్. సాధారణంగా ఇతర కంపెనీలు సర్క్యులర్ డిజైన్ వాడతాయి, కానీ ఆపిల్ మాత్రం వర్టికల్ ఓవల్ షేప్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చాలని భావిస్తోంది. ఈ కెమెరా ద్వారా వినియోగదారులు నేరుగా తమ గ్లాసెస్ నుంచే ఫోటోలు తీయవచ్చు. వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఈ విధంగా తీసిన ఫోటోలు వెంటనే మీ ఐఫోన్‌తో సింక్ అవుతాయి. అంటే, ఫోన్ జేబులో నుంచి తీయకుండానే మీరు క్షణాల్లో ఫోటోలను ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు.

45
స్మార్ట్ ఫీచర్లు, సిరి సపోర్ట్
Image Credit : pinterest

స్మార్ట్ ఫీచర్లు, సిరి సపోర్ట్

ఆపిల్ ఈ గ్లాసెస్‌ను కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, మల్టీ టాస్కింగ్ కోసం రూపొందిస్తోంది. దీని ద్వారా మీరు కాల్స్ మాట్లాడవచ్చు, మ్యూజిక్ వినవచ్చు, నోటిఫికేషన్లను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మెరుగైన సిరి వాయిస్ కమాండ్స్ ద్వారా మీ పనులను మరింత సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే, ఇందులో కంప్యూటర్ విజన్ టెక్నాలజీని కూడా వాడే అవకాశం ఉంది. దీనివల్ల గ్లాసెస్ మీ చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించి, మీకు నావిగేషన్, సమాచారాన్ని రియల్ టైమ్‌లో అందిస్తాయి.

55
ఆపిల్ ఈకోసిస్టమ్‌తో అనుసంధానం
Image Credit : Pexels

ఆపిల్ ఈకోసిస్టమ్‌తో అనుసంధానం

ఆపిల్ ప్రొడక్ట్స్ అంటేనే ఒకదానితో ఒకటి అద్భుతంగా పని చేస్తాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ కూడా మీ ఐఫోన్, ఆపిల్ వాచ్, ఇతర డివైజ్‌లతో సులభంగా సింక్ అవుతాయి. దీనివల్ల డేటా ట్రాన్స్‌ఫర్ వేగంగా జరుగుతుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అయితే, ఇందులో విజన్ ప్రో వంటి హెడ్ సెట్లలో ఉండే భారీ డిస్ప్లేలు ఉండకపోవచ్చు. ఆపిల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. ప్రజలు రోజూ వాడేలా, తేలికగా ఉండే ఒక స్మార్ట్ ప్రొడక్ట్‌ను అందించడంగా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
గాడ్జెట్‌లు
కృత్రిమ మేధస్సు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
JioShield : నెలకు కేవలం రూ.83 చాలు.. మీ పిల్లలు ఫోన్ కు బానిస కాకుండా కాపాడే సూపర్ యాప్ మీసొంతం
Recommended image2
Lazy Glasses: ప‌డుకునే పుస్త‌కం చ‌ద‌వొచ్చు, టీవీ చూడొచ్చు.. లేజీ గ్లాసెస్‌తో ఎన్నో ఉప‌యోగాలు
Recommended image3
Mivi One 5G: రూ. 12 వేల‌కే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్ల విష‌యంలో త‌గ్గేదేలే
Related Stories
Recommended image1
AI Smartphones : ఇక ఫోనే అన్నీ చూసుకుంటుంది! AI స్మార్ట్‌ఫోన్ల రేంజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Recommended image2
SIP Investment Tips : నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 6 కోట్ల సంపద ఎలా బాసూ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved