YouTube: యూట్యూబ్ క్రియేటర్లకు షాక్.. ఇకపై అలాంటి వీడియోలకు చెక్..
YouTube Monetization Policy 2025 : యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాక్.. జూలై 15 నుండి కొత్త మానిటైజేషన్ విధానాన్ని అమలు కానున్నది. ఈ మానిటైజేషన్ పాలసీల్లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా రీసైకిల్, AI వీడియోలకు చెక్ పెట్టడమే దీని ఉద్దేశం.
- FB
- TW
- Linkdin
Follow Us

రీయూస్ కంటెంట్ కు చెక్
యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్( YPP) పాలసీ అప్‌డేట్ అయింది. ఈ అప్ డేట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రీపిటెట్ వీడియోస్ కు చెక్ పెట్టింది. అంటే ఒకే వీడియోను స్వల్ప మార్పులతో పదే పదే అప్‌లోడ్ చేయరాదు. ఇలాంటి వీడియోలను పునర్వినియోగ కంటెంట్‌గా (inauthentic content) పరిగణిస్తారు. ఇలాంటి వీడియోలను పదేపదే పోస్ట్ చేస్తే.. మానిటైజేషన్‌ను తొలగించవచ్చు.
AI జనరేటెడ్ కంటెంట్ పై కొరడా
వీడియోలో స్క్రిప్ట్, వాయిస్‌ఓవర్, విజువల్స్ అన్నీ AI తో రూపొందించినట్టు అలాంటి కంటెంట్ ను AI జనరేటెడ్ కంటెంట్ అంటారు. ఇలాంటి కంటెంట్ ను YouTube దాన్ని అసలైన కంటెంట్‌గా పరిగణించదు. ఇలా చేస్తే మానిటైజేషన్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.
స్పామ్ తరహా వీడియోలకు పుల్ స్టాప్
ఇప్పటికే ఉపయోగించిన ఫోటోలతో స్లైడ్ షోలు, లూప్డ్ వీడియోలు లేదా పదే పదే ఒకే క్లిప్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయరాదు. ఇలా కంటెంట్ ఉన్న వీడియోలను YouTube స్పామింగ్‌గా పరిగణిస్తోంది. ఈ విధమైన కంటెంట్ వల్ల ఛానెల్ డీమానిటైజ్ అయ్యే ప్రమాదం ఉంది.
తప్పుడు కంటెంట్‌పై నిషేధం
నకిలీ వాస్తవాలు, పరిశోధనలేని AI సిద్ధాంతాలు, తప్పుడు శీర్షికలు లేదా తప్పుడు థంబ్‌నెయిల్‌లకు యూట్యూబ్ చెక్ పెట్టనున్నది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫ్లాగ్ చేయబడతాయి. ఇలాంటి కంటెంట్‌ను అభ్యాసపూరితంగా అప్‌లోడ్ చేస్తే, మీ ఛానెల్ ను నిషేధించవచ్చు.
ఆటోమేటెడ్ వీడియోలతో ముప్పు
మీ ఛానెల్‌లో ఆటోమేటెడ్ వీడియోలు, బోట్ వాయిస్, ప్రత్యేకత లేని కంటెంట్ మాత్రమే ఉంటే YouTube దాన్ని అసలైన కంటెంట్‌గా పరిగణించదు. దీంతో మానిటైజేషన్ కోల్పోయే లేదా ఛానెల్ నిలిపివేసే ప్రమాదం ఉంది.
ముఖ్యమైన సూచనలు
- స్క్రిప్ట్‌ను స్వయంగా రాయండి లేదా వేరే వ్యక్తితో (రచయిత) కంటెంట్ సిద్ధం చేసుకోండి .
- మీ స్వంతగా వాయిస్ ఇవ్వండి లేదా వాయిస్ ఆర్టిస్ట్ వాయిస్ ఉపయోగించండి.
- ప్రతి వీడియోలో వినూత్నం, విలువైన సమాచారం ఇవ్వండి.
- పునర్వినియోగం లేదా లూప్డ్ ఫుటేజ్‌లను దూరం పెట్టండి .
- మీ ఛానెల్‌కి స్పష్టమైన థీమ్ లేదా లక్ష్యాన్ని నిర్ధారించి, దానిపైనే కంటెంట్ రూపొందించండి.
- ఇలా చేస్తే.. YouTube మానిటైజేషన్‌కు అర్హత పొందే అవకాశాలు పెరుగుతాయి.