MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Xiaomi 15: ఫోన్‌ అంటే ఇది కదా.. కళ్లు చెదిరే ఫీచర్లతో షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Xiaomi 15: ఫోన్‌ అంటే ఇది కదా.. కళ్లు చెదిరే ఫీచర్లతో షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. షావోమీ 15 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎప్పటినుంచి అందుబాటులోకి రానున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Published : Mar 05 2025, 03:28 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ మార్కెట్లోకి షావోమీ 15, షావోమీ 15 అల్ట్రా పేరుతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ విషయాన్ని షావోమీ అధికారికంగా ప్రకటించింది. మార్చి 15వ తేదీన ఈ రెండు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫోన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

23
Xiaomi-15

Xiaomi-15

షావోమీ 15 ఫీచర్లు: 

షావోమీ 15 స్మార్ట్‌ఫోన్‌లో 6.36 ఇంచెస్‌తో కూడిన క్రిస్టల్‌ రెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. అలాగే ఇందులో ట్రిపుల్‌ కెమెరాతో కూడిన రెయిర్‌ సెటప్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన లైకా మెయిన్‌ కెమెరాను ఇవ్వనున్నారు. 60ఎమ్‌ఎమ్‌ ఫ్లోటింగ్‌ టెలిఫొటో లెన్స్‌, 14 ఎమ్‌ఎమ్‌ అల్ట్రా వైడ్‌ కెమెరాను అందించనున్నారు. 8కే రిజల్యూషన్‌తో కూడిన వీడియో రికార్డింగ్‌ చేసుకునే విధంగా ఈ ఫోన్‌ను డిజైన్‌ చేశారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాన్‌ 8 ఎలైట్‌ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 

బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్లో 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5240 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ షావోమీ హైపర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పవర్డ్‌ టూల్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 

33
Xiaomi-15

Xiaomi-15

షావోమీ 15 అల్ట్రా ఫీచర్లు: 

షావోమీ 15 అల్ట్రా ఫోన్‌ను ప్రీమియం డిజైన్‌తో రూపొందించనున్నారు. ఈ ఫోన్‌ను సిల్వర్‌ క్రోమ్‌ కలర్‌ వేరియంట్‌లో తీసుకురానున్నారు. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నారు. ఇక ఇందులో 6.73 ఇంచెస్‌తో కూడిన డబ్ల్యూక్యూహెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్‌ 3200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

అలాగే ఇందులో అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాన్‌ 8 ఎలైట్‌ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక కెమరా విషయానికొస్తే ఇందులో లైకా ట్యూన్డ్‌ క్వాడ్‌ కెమెరా సిస్టమ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు.

ఈ ఫోన్‌ 4కే రిజల్యూషన్‌ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌ 90 వాట్స్‌ వైర్డ్‌, 80 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5410 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్‌ కూడా షావోమీ హైపర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ రెండు ఫోన్‌లు అమెజాన్‌, ఎమ్‌ఐ.కామ్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో అందుబాటులోకి రానున్నాయి. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories