WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్ పడినట్టే!
WhatsApp safety feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల భద్రత కోసం సేఫ్టి ఓవర్వ్యూ, AI ఆధారిత స్కామ్ డిటెక్షన్, లక్షల అకౌంట్ల బ్లాక్, తెలియని వ్యక్తులపై హెచ్చరికలతో యాప్ ను మరింత సురక్షితంగా మార్చనున్నాయి.

సైబర్ నేరాల చెక్
WhatsApp safety feature: రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టడానికి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త సేఫ్టీ ఫీచర్ ను తీసుకోవచ్చింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, స్కామ్ గ్రూపులు, అనవసర సందేశాలను గుర్తించి వాటిని నివారించేందుకు మెటా యాజమాన్యం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా వాట్సాప్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 6.8 మిలియన్ అనుమానాస్పద అకౌంట్లు మూసివేసినట్లు వెల్లడించింది. వీటి భాగంగా క్రిమినల్ స్కామ్ సెంటర్లకు సంబంధించిన అనేక ఖాతాలను పూర్తిగా బ్లాక్ చేసింది.
గ్రూప్ చాట్స్‌కు 'సేఫ్టీ ఓవర్‌వ్యూ' ఫీచర్
వాట్సాప్ తాజాగా తీసుకవచ్చిన "సేఫ్టీ ఓవర్‌వ్యూ (Safety Overview)"అనే ఫీచర్ ను తీసుకవచ్చింది. వ్యక్తిగత చాట్‌లలో, గ్రూప్ చాట్‌లలో స్కామ్ సందేశాలను గుర్తించడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. వాట్సాప్ గ్రూప్ చాట్‌ల కోసం సేఫ్టీ ఓవర్‌వ్యూ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వినియోగదారునికి తమను ఎవరు గ్రూప్‌లో జోడించారో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు గ్రూప్‌కి జోడిస్తే అప్రమత్తం చేస్తుంది. గ్రూప్ గురించి సమాచారంతో పాటు, సురక్షితంగా ఉండటానికి చిట్కాలు కూడా అందిస్తోంది. అలాగే, గ్రూప్‌లో ఎవరైనా సభ్యుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారో లేదో కూడా మీరు చూడగలరు.
గ్రూప్ నోటిఫికేషన్స్ మ్యూట్
కొత్తగా జాయిన్ అయ్యే గ్రూప్‌కి సంబంధించిన నోటిఫికేషన్లు స్వయంగా మ్యూట్ అవుతాయి. వినియోగదారుడు ఆ గ్రూప్ గురించి తెలుసుకున్న తరువాత మాత్రమే వాటిని తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది స్కామ్, స్పామ్ నుండి ఉపశమనం కలిగిస్తోంది.
తెలియని వ్యక్తులతో చాట్ కు ముందు హెచ్చరిక
వాట్సాప్‌లో స్కామర్లు చాలాసార్లు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. దీనిని నివారించేందుకు, చాట్ ప్రారంభించే ముందు తెలియని వ్యక్తులపై ప్రత్యేకంగా హెచ్చరిస్తుంది.వినియోగదారులు తమకు తెలిసిన వ్యక్తులతోనే కమ్యూనికేషన్ జరిపేలా, అప్రమత్తం చేసే విధంగా ఈ ఫీచర్ ను రూపొందించారు. ఈ సమాచారం ఆధారంగా మీరు గ్రూపులో ఉండాలా? లేదా? అనేది నిర్ణయించుకోవచ్చు.
అవసరమైతే గ్రూప్‌లో చేరేముందు ప్రీవియస్ చాట్‌ను కూడా చూడొచ్చు. ఇంతకుముందు ఇలా ప్రీవియస్ చాట్‌ను చూసే వెసులుబాటు లేదు. ఎగ్జిట్ అవ్వాలనుకుంటే గ్రూప్‌లో మెసేజ్‌లను చూడకుండానే అవ్వొచ్చు. మీరు గ్రూప్‌లో ఉండాలనుకుంటే మాత్రం చెక్‌మార్క్ చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు మెసేజ్ నోటిఫికేషన్లు మ్యూట్‌లోనే ఉంటాయి.
ఓపెన్ ఏఐతో స్కామ్‌లకు చెక్
వాట్సాప్ ఓపెన్‌ఏఐ సహకారంతో స్కామ్ చర్యలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటుంది. కంబోడియాలోని ఒక స్కామ్ సెంటర్ నుంచి వచ్చే అక్రమ సంకేతాలను గుర్తించి, యాక్సెస్‌ను నిలిపివేసింది. అలాగే.. స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన పెట్టుబడి చిట్కాలంటూ కొందరు మనల్ని తెలీని గ్రూప్‌లో యాడ్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ సంస్థ తెలిపిన ప్రకారం, భవిష్యత్తులో మరిన్ని భద్రతా ఫీచర్లు, AI ఆధారిత స్కామ్ డిటెక్షన్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రమాదాన్ని ముందే గుర్తించి వినియోగదారులను కాపాడే లక్ష్యంతో, సురక్షితంగా మెసేజింగ్ అనుభవం కల్పించడమే వాట్సాప్ లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది.