MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • అసలేంటీ 'DeepSeek'.. ఇంత సంచలనంగా ఎందుకు మారింది? అమెరికా ఎందుకు భయపడుతోంది? పూర్తి కథనం

అసలేంటీ 'DeepSeek'.. ఇంత సంచలనంగా ఎందుకు మారింది? అమెరికా ఎందుకు భయపడుతోంది? పూర్తి కథనం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ రంగంలోకి చైనా కూడా వచ్చి చేరింది. చైనాకు చెందిన ఏఐ టూల్‌ డీప్‌సాక్‌ ఒక్కసారిగా టెక్‌ ప్రపంచాన్ని షేక్‌ చేసింది. ఈ టూల్‌ రాకతో అమెరికాకు చెందిన ఏఐ కంపెనీ దారుణంగా నష్టాలను చవి చూసింది. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ డీప్‌సీక్‌.? ఇది ఎలా పనిచేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

3 Min read
Narender Vaitla
Published : Jan 29 2025, 11:35 AM IST| Updated : Jan 29 2025, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

డీప్‌సీక్‌ ఏఐ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడీ యాప్‌ యాపిల్‌ స్టోర్‌లో టాప్ డౌన్‌లోడ్స్‌తో ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరించింది. ఈ కొత్త టూల్‌ రాకతో కొన్ని టెక్ స్టాక్స్ భారీ నష్టాన్ని చవిచూశాయి. ఇది AI రంగంలో చైనా సాంకేతికత ఏ స్థాయికి చేరుకుందో ప్రపంచానికి చూపించింది. డీప్‌సీక్‌ కొత్త వెర్షన్‌ జనవరి 20వ తేదీన విడుదల చేశారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, చాట్‌జీపీటీ వంటి వాటికి తీవ్ర పోటీగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

24

ట్రంప్‌ స్పందన.. 

డీప్‌సీక్‌ ఏఐ టూల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం స్పందించారంటేనే ఇది చూపిన ఇంపాక్ట్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 'అమెరికా కంపెనీలను ఇది మేల్కొలిపే అంశంగా' ఆయన అభివర్ణించారు. అమెరికా కంపెనీలు ఏఐపై మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు డీప్‌సీక్‌ టెక్నాలజీ వెనకాల ఉన్న మోడల్స్‌పై లోతుగా పరిశోధనలు మొదలు పెట్టాయి. 

దీని ప్రత్యేకత ఏంటంటే.. 

దీని ప్రత్యేకత విషయానికొస్తే అత్యుత్తుమ ఏఐ మోడల్‌గా చెబుతున్న డీప్‌సీక్‌ తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయడం విశేషం. OpenAI వంటి కంపెనీలు అత్యాధునిక చిప్స్‌పై ఆధారపడగా, DeepSeek తక్కువ ఖర్చుతో పని చేసేలా రూపొందించారు. ఇది OpenAI మోడల్స్‌కు ప్రత్యామ్నాయంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. డీప్‌సీక్‌ రాకతో ప్రపంచ చిప్‌ దిగ్గజం Nvidiaపై తీవ్రంగా పడింది. డీప్‌సీక్‌ విడుదలైన తొలి రోజే Nvidia మార్కెట్ విలువ దాదాపు 600 బిలియన్ డాలర్లు కుప్పకూలింది . ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఒక్కరోజు నష్టంగా నిపుణులు చెబెతున్నారు. ఈ పతకం ఒక్క Nvidia మాత్రమే పరిమితం కాలేదు. AMD, Intel వంటి కంపెనీల షేర్లు కూడా నష్టపోయాయి.

చైనా స్పందన ఏంటంటే.. 

చైనా ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. అక్కడి అధికారిక మీడియా DeepSeekను అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోందని వార్తలు ప్రచురించింది. ఇది "చైనా టెక్నాలజీ పెరుగుదల"కు నిదర్శనం అని చెబుతోంది. అయితే దీని కారణంగా చైనా టెక్ పరిశ్రమ ప్రపంచంలో ఒంటరిగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అత్యాధునిక చిప్స్ ఎగుమతిపై నిషేధం విధించినా ఈ కొత్త ఏఐ చైనా విజయంగా భావిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ AIని అత్యున్నత ప్రాధాన్యతగానే చూస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. AI రంగంలో చైనా ముందంజలో ఉందని చైనా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
 

34

అమెరికా ఏమంటోంది.. 

ఇదిలా ఉంటే డీప్‌సీక్‌ భద్రతా ప్రమాణాలు, డేటా గోప్యతపై అమెరికా శాస్త్రవేత్తలు, అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ టెక్నాలజీ భద్రతపై సందేహాలున్నాయని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియా మంత్రి హుసిక్‌ దీనిపై స్పందిస్తూ.. డీప్‌సీక్‌ భద్రతపై సందేహాలున్నాయని, దీని డేటా విధానాలను సమగ్రంగా సమీక్షించాలన్నారు. దీంతో ఈ డీప్‌సీక్‌ ఏఐ రంగంలో కొత్త చర్చలకు తెరతీసింది. 

అసలేంటీ డీప్‌సీక్‌.? 

DeepSeek అనేది ChatGPT మాదిరిగానే పనిచేసే ఒక ఉచిత AI చాట్‌బాట్. ఇది గణితశాస్త్రం, కోడింగ్ వంటి అంశాల్లో OpenAI o1 మోడల్‌తో సమానమైన శక్తిని కలిగి ఉందని చెబుతున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, తక్కువ మెమరీని ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతో పని చేయగలగడం. ఇది చిన్న కంప్యూటింగ్ వనరులతోనూ అధిక పనితీరును అందించగలదని AI పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా ఏఐ మోడల్స్‌ మాదిరిగా కాకుండా డీప్‌సీక్ కొన్ని రాజకీయంగా సున్నితమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వదు. చైనా నియంత్రణ విధానాలకు అనుగుణంగా ఈ మోడల్‌ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

దీని వెనకాల ఎవరున్నారు.? 

డీప్‌సీక్‌ టెక్నాలజీ 2023 డిసెంబర్ లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ అనే చైనా ఏఐ సైంటిస్ట్‌ రూపొందించారు. లియాంగ్‌ జెజియాంగ్ విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేశాడు. అనంతరం ఆర్థిక రంగంలో పనిచేశాడు. అతను High-Flyer అనే క్వాంట్ హెడ్జ్ ఫండ్‌కు CEOగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ AIని ఉపయోగించి ఫైనాన్స్ రంగంలో డేటా విశ్లేషణలు నిర్వహిస్తుంది. DeepSeek అభివృద్ధిలో చైనా ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

44

అసలు ఎలా పుట్టింది.? 

High-Flyer 2023లో ఏఐ పరిశోధనలోకి ప్రవేశించగా కొద్ది నెల్లోనే డీప్‌సీక్‌ అభివృద్ధి చేశారు. ఇక ఈ కొత్త టెక్నాలజీ రావడం వెనకాల ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. Nvidia A100 కంపెనీకి చెందిన చిప్స్‌ను నిల్వచేయడమే కారణంగా చెబుతున్నారు. ఈ చిప్స్ 2022 సెప్టెంబర్‌లో అమెరికా చైనా ఎగుమతుల నిషేధం విధించినప్పటికీ, DeepSeek టీమ్ వాటిని ముందుగానే భారీగా నిల్వచేసిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

అమెరికా కంపెనీలకు ఎందుకు ఇబ్బంది.? 

డీప్‌సీక్‌ రాకతో హై-ఎండ్ చిప్స్ లేని AI మోడల్స్ కూడా అగ్రస్థాయికి చేరవచ్చని స్పష్టమవుతోంది. OpenAI, Meta వంటి కంపెనీలు AI అభివృద్ధికి భారీగా ఖర్చు చేస్తున్నాయి. అయితే DeepSeek తక్కువ ఖర్చుతో అదే స్థాయికి చేరుకోవడం అమెరికా టెక్ కంపెనీలకు పెద్ద ముప్పుగా మారింది. డీప్‌సీక్‌ రాకతో జనవరి 27వ తేదీన Nasdaq సూచీ 3% పడిపోయింది. Nvidia షేర్లు 17% నష్టపోయాయి. దీంతో Nvidia ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. AI రంగంలో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని అమెరికా టెక్ దిగ్గజాలు వ్యూహాత్మక మార్పులు చేయవలసిన అవసరం ఉంది.

మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? 

డీప్‌సీక్‌ ఏఐ టెక్నాలజీతో భవిష్యత్తులో పెను మార్పులు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో స్మార్ట్‌ లెర్నింగ్‌, కస్టమైజ్డ్‌ లెర్నింగ్‌ వంటివి అందుబాటులోకి రానున్నాయి. ఏఐ టూల్‌తో కంపెనీలు వేగంగా పనిని పూర్తి చేయడంతో పాటు ఉత్పాదకతను పెంచుకుంటాయి. ఏఐ ఆధారంగా కేన్సర్, గుండె సంబంధిత వ్యాధుల వంటి సమస్యలను త్వరగా గుర్తించగలుగుతుంది. 
 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
కృత్రిమ మేధస్సు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved