Thomson: రూ. 37 వేలకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఏకంగా 50 శాతం డిస్కౌంట్.
ఈ కామర్స్ సంస్థల మధ్య రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. దీంతో సమయంతో సంబంధం లేకుండా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పెద్ద స్క్రీన్‌లతో కూడిన స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బిగ్ స్క్రీన్ టీవీలను కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. 65 ఇంచెస్ టీవీ కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కువ రూ. లక్ష వరకైనా చెల్లించాల్సిందే. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఓ స్మార్ట్ టీవీపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
థామ్సన్ 65 ఇంచెస్ క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 84,999గా ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 43,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్ ఇక్కడితోనే ఆగిపోలేదు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1250 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని సుమారు రూ. 42 వేలకే సొంతం చేసుకోవచ్చు. మీ పాత టీవీ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 5,400 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఉదాహరణకు మీ పాత టీవీకి రూ. 5 వేల ఎక్స్ఛేంజ్ పొందినా 65 ఇంచెస్ టీవీని కేవలం రూ. 37 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట.
ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 65 ఇంచెస్‌తో కూడిన క్యూఎల్‌ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4కే స్క్రీన్‌ను అందించారు. ఈ స్మార్ట్ గూగుల్ టీవీలో డాల్టీ ఆటమ్స్‌తో కూడిన సౌండ్ సిస్టమ్‌ను అందించారు. 40వాట్స్ సౌండ్ అవుట్‌పుట్, డీటీఎస్ సరౌండ్, గూగుల్ అసిస్టెంట్, డ్యూయల్ బాండ్ వైఫై వంటి ఫీచర్లను అందించారు. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
Smart tv offer
ఈ టీవీలో 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ టీవీ మీడియాటెక్ ఎమ్‌టీ9602 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో ఇథర్ నెట్, హెచ్‌డీఎమ్‌ఐ, బ్లూటూత్ 5.0, యాపిల్ ఎయిర్‌ప్లే వంటి ఫీచర్లను అందించారు. 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. 1.1 బిలియన్ కలర్స్‌తో ఈ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఏడాది వారంటీ అందిస్తోంది.
గమనిక: ఈ సమాచారాన్ని ప్రాథమికంగానే భావించాలి. ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసే ముందు ఇతర యూజర్ల రివ్యూలు, రేటింగ్స్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాత కొనుగోలు చేయడం ఉత్తమం.