Google photos: గూగుల్ ఫొటోస్ మెమోరీ ఫుల్ అని మెసేజ్ వస్తుందా.? ఈ సింపుల్ ట్రిక్‌తో స్టోరేజ్ పెంచుకోండి.
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ జీమెయిల్ ఐడీ ఉంటుంది. జీమెయిల్ అనేది కేవలం మెయిల్స్ పంపించుకోవడానికి మాత్రమే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మనకు తెలియని కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు ఫోటోలను మెమోరీ కార్డుల్లో స్టోర్ చేసుకునే వారు. కానీ గూగుల్ ఫొటోస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మెమోరీ కార్డులతో పని లేకుండా పోయింది. ఫోన్‌లో ఉన్న ప్రతీ ఫొటో ఎంచక్కా గూగుల్ ఫొటోల్లో స్టోర్ అవుతున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ ఫార్మట్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫొటోలను తిరిగి పొందే అవకాశం లభిస్తోంది.
అయితే గూగుల్ ఫొటోస్‌లో మెమోరీ ఎక్కువైతే.. స్టోరేజీ ఫుల్ అనే అలర్ట్ వస్తుంటుంది. మెమోరీ క్లియర్ చేయకోతే మెయిల్స్ రావనే మెసేజ్ వస్తుంది. అయితే స్టోరేజీని పెంచుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం.

కంప్రెస్ ఫొటోస్:
* ఇందుకోసం ముందుగా బ్రౌజర్‌లోకి వెళ్లి. ఫొటోస్.గూగుల్.కామ్‌లోకి వెళ్లాలి.
* అనంతరం ఎడమ వైపు ఉండే త్రి డాట్స్‌ను క్లిక్ చేసి చివరిలో కనిపించే స్టోరేజీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* తర్వాత కొంచం కిందికి స్క్రోల్ చేస్తే రికవరీ స్టోరేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద కనిపించే లెర్న్ మోర్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* వెంటనే రికవరీ స్టోరేజీ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చివరిలో కనిపించే 'ఐ అండర్ స్టాండ్' అనే టిక్ బాక్స్‌ను క్లిక్ చేసి 'కంప్రెస్ ఎక్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్'పై క్లిక్ చేయాలి.
* దీంతో గూగూల్ ఫొటోస్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు కంప్రెస్ అయ్యి మెమోరీ పెరుగుతుంది.
ఫ్రీ అప్ స్పేస్:
గూగుల్ ఫోటోస్‌లో ఉండే కొన్ని రకాల అనవసరమైన కంటెంట్‌ను డిలీట్ చేసినా స్టోరేజ్ పెరుగుతుంది. ఇందుకోసం ముందుగా మీ జీమెయిల్ అకౌంట్ లాగిన అవ్వాలి. ఆ తర్వాత బ్రౌజర్‌లో https://one.google.com/storage సెర్చ చేయాలి. అనంతరం 'ఫ్రీ అప్ అకౌంట్ స్టోరేజ్' పై క్లిక్ చేసి. స్పామ్, ట్రాష్, లార్జ్ ఫైల్స్ వంటి వాటిని డిలీట్ చేసుకోవచ్చు.
అలాంటి వాటిని డిలీట్ చేయండి:
కొన్ని సందర్భాల్లో మనంలో ఫోన్‌లో తీసిన డూప్లికేట, బ్లర్ ఫొటోలు కూడా గూగుల్ ఫోటోస్‌లో స్టోర్ అవుతాయి. నిజానికి వీటితో అవసరం ఉండదు. కానీ స్పేస్ వృథాగా పోతుంది. కాబట్టి ఇలాంటి వాటిని డిలీట్ చేసుకుంటే స్పేస్ పెరుగుతుంది.