కళ్లు చెదిరే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ మొబైల్స్‌పై ఏకంగా రూ. 20 వేల డిస్కౌంట్.
Flipkart Super Value Days Sale: ఏడాది ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను ఆకర్షించే క్రమంలో అదిరిపోయే సేల్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వ్యాల్యు డేస్ సేల్ పేరుతో డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ సేల్‌లో లభిస్తున్న కొన్ని బెస్ట్ డీల్స్ మీకోసం..
వివో టీ3 ఎక్స్
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 18,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 14,499కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఐపీ64 రేటింగ్ ఈ ఫోన్ సొంతం.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 89,999కాగా సేల్‌లో భాగంగా రూ. 42,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. యాక్సిస్ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్ వైర్‌లెస్, 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 3900 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
రియల్‌మీ జీటీ6
రియల్‌మీ జీటీ 6 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 43,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా రూ. 37,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 120 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
మోటరోలో ఎడ్జ్ 50 ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 41,999గా ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 31,999కే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 27,549కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇందులో ఐపీ68 రేటింగ్‌ను అందించారు. 144 హెచ్‌జెడ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన 7 జెన్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇన్‌ఫినిక్స్ జీటీ20 ప్రో
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 31,999కాగా సేల్‌లో భాగంగా రూ. 22,999కి లభిస్తోంది. పలు రకాల బ్యాంక్ ఆఫర్లతో అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫో్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్లిమేట్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచారు.