Laptop: రూ. 15 వేలకే ల్యాప్‌టాప్.. ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొనేస్తారు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఎంత కామన్‌గా మారిందో ల్యాప్‌టాప్‌లు అలాగే మారాయి. ప్రతీ ఒక్క ఇంట్లో ల్యాప్‌టాప్ కచ్చితంగా ఉండాల్సిందే. కరోనా తర్వాత వీటి వినియోగం భారీగా పెరిగింది. ఉద్యోగులతో పాటు విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్ అనివార్యంగా మారింది. కాగా ల్యాప్‌టాప్‌ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. ఫోన్ కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ఒక బెస్ట్ ల్యాప్‌టాప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు ల్యాప్‌టాప్ కొనాలంటే కనీసం రూ. 50 వేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం మాత్రం ల్యాప్‌టాప్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంచి ఫీచర్లతో తక్కువ ధరలోనే ల్యాప్‌టాప్ లభిస్తాయి. ప్రస్తుతం అమెజాన్‌లో అలాంటి ఒక బెస్ట్ డీల్ లభిస్తోంది. Chuwi HeroBook Pro ల్యాప్‌టాప్‌పై ఏకంగా 54 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతంటే..

Chuwi HeroBook Pro ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 34,990కాగా అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,999కి లభిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 15 వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 5600 వరకు తగ్గింపు ధరకే ఈ ల్యాప్‌టాప్‌ను పొందొచ్చు.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కెలెరాన్ ఎన్4020 ప్రాసెసరతో పనిచేస్తుంది. 1.1GHz నుంచి 2.8GHz వరకూ మెగాహెర్ట్జ్ స్పీడ్‌తో ఇది ప్రాసెసింగ్ పనులను సులభంగా నిర్వహిస్తుంది. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్‌ను అదించారు. మల్టీ అప్లికేషన్స్‌కు ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. స్టోరేజీ విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌లో 256 జీబీ స్టోరేజీని అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమతో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ మెమోరీని 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌తో పెంచుకోవచ్చు.
ఇక ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 14.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1920×1080 పిక్సెల రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐపీఎస్ ప్యానెల్, ఫుల్‌హెచ్‌డీ రిజల్యూషన్‌తో వీడియోలను వీక్షించవచ్చు. అల్ట్రా స్లిమ్‌గా ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ ల్యాప్‌టాప్‌లో యూఎస్‌బీ 3.0, మినీ హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులను అందించారు.