- Home
- Technology
- Tech News
- Smart TV: రూ. 23 వేలకే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. రూ. 40 వేల సామ్‌సంగ్ టీవీపై భారీ డిస్కౌంట్
Smart TV: రూ. 23 వేలకే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. రూ. 40 వేల సామ్‌సంగ్ టీవీపై భారీ డిస్కౌంట్
ఈ కామర్స్ సంస్థలు సీజన్‌తో సంబంధం లేకుండా ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో స్మార్ట్ టీవీపై సూపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Samsung smart TV
ప్రస్తుతం స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే సామ్‌సంగ్ వంటి కంపెనీ టీవీల ధరలు ఎక్కువగా ఉంటాయని తెలిసిందే. కానీ అమెజాన్‌లో సామ్‌సంగ్ టీవీలపై ఏకంగా 39 శాతం డిస్కౌంట్ లభస్తోంది. ఇంతకీ ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Smart TV offer
సామ్‌సంగ్ 43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ అసలు ధర రూ. 40,400గా ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో 39 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 24,490కి సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే డిస్కౌంట్ ఇక్కడితో ముగియలేదు. కొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1300 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 23 వేలకే సొంతం చేసుకోవచ్చు.
Smart TV offer
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 43 ఇంచెస్‌తో కూడిన ఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ, హైపర్ రియల్ పిక్చర్ ఇంజన్‌ను అందించారు. 1080 పిక్సెల్ రిజల్యూషన్ 50 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఈ టీవీ సొంతం. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ టీవీ వైఫై, యూఎస్‌బీ, ఇథర్ నెట్, హెచ్‌డీఎమ్‌ఐ వంటి ఫీచర్లను అందించారు.
Smart TV offer
ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ డిజిటల్ ప్లస్ టెక్నాలజీని అందిచారు. అలాగే పవర్‌ఫుల్ స్పీకర్స్‌ను ఇందులో ఇచ్చారు. Tizen ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్, 1.5 జీబీ ర్యామ్‌ను, 8జీబీ స్టోరేజ్‌ను అందించారు. 20 వాట్స్ 2సీహెచ్ స్పీకర్స్‌ను ఇచ్చారు. కంపెనీ స్టాండర్డ్ బ్రాండ్ వారంటీని అందిస్తోంది. స్మార్ట్ టీవీపై రెండేళ్ల వ్యారెంటీని అందిస్తోంది.