MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Sports
  • పాపంరా శాంసన్.! ఇక 11వ స్థానంలో కూడా ఆడే ఛాన్స్ ఇస్తారు.. ఏకీపారేసిన మాజీ క్రికెటర్

పాపంరా శాంసన్.! ఇక 11వ స్థానంలో కూడా ఆడే ఛాన్స్ ఇస్తారు.. ఏకీపారేసిన మాజీ క్రికెటర్

Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత ఓపెనర్‌గా రాణించిన సంజూ శాంసన్‌కు ఆసియా టీ20 కప్‌లో కష్టాలు మొదలయ్యాయి. శుభ్‌మన్ గిల్ రాకతో సంజూ స్థానం కోల్పోయాడు. ఇప్పుడు అతడిని ఐదవ నుంచి ఎనిమిదవ స్థానం వరకు బ్యాటింగ్‌కు పంపుతున్నారు.  

1 Min read
Author : Pavithra D
Published : Nov 01 2025, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గిల్ వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీతో..
Image Credit : Instagram

గిల్ వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీతో..

టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌లలో 183కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి, మూడు శతకాలు నమోదు చేశాడు. అయితే, ఆసియా టీ20 కప్ 2025లో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడంతో సంజూకు పరిస్థితులు మారిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంజూ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పు..
Image Credit : Instagram

సంజూ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పు..

భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న గిల్ ఓపెనర్‌గా వచ్చేందుకు యాజమాన్యం సంజూపై వేటు వేసింది. ఆ టోర్నీలో సంజూకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రత్యేక స్థానం లేకుండా పోయింది. ఆసియా కప్‌లో మూడుసార్లు ఐదవ స్థానంలో, ఒకసారి ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

35
మాజీ కెప్టెన్ స్పందించారు
Image Credit : Instagram

మాజీ కెప్టెన్ స్పందించారు

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదవ స్థానం వరకు అతడికి పిలుపు రాలేదు. వికెట్ కీపర్‌గా మాత్రమే అతడి సేవలను ఉపయోగించుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తొలి టీ20లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు.

45
శాంసన్ అత్యంత దురదృష్టవంతుడు
Image Credit : Instagram

శాంసన్ అత్యంత దురదృష్టవంతుడు

భారత జట్టులో ప్రస్తుతం సంజూ శాంసన్ అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఓపెనర్‌గా సెంచరీ చేసిన అతడిని ఇప్పుడు మూడు నుండి ఎనిమిదవ స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్‌కు పంపడానికి మేనేజ్‌మెంట్ వెనుకాడటం లేదని, అవసరమైతే 11వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయమంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

55
 డిమోట్ చేయడం సరికాదు
Image Credit : Instagram

డిమోట్ చేయడం సరికాదు

టాప్ ఆర్డర్‌లో రాణించిన ఆటగాడిని డిమోట్ చేయడం సరికాదని, ఇది ఆటగాడి మనసును గాయపరుస్తుందని ఆయన అన్నారు. సంజూకు ప్రస్తుతం దీనికంటే గొప్ప ఆప్షన్ లేదని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ జరగకపోగా.. రెండో మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చాడు సంజూ. చూడాలి మరి వచ్చే సిరీస్ లోనైనా సంజూ బ్యాటింగ్ పై క్లారిటీ వస్తుందో.. లేక జట్టులో చోటు కోల్పోతాడో..

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2026: ఆర్సీబీకి బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా?
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved