అబ్బ సాయిరాం.! SRHలోనే కాటేరమ్మ కొడుకు.. రిలీజ్ లిస్టులో బడా ప్లేయర్స్.. ఎవరంటే.?
SRH: ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్టులను ప్రకటించేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుకున్నట్టుగానే తమ కోర్ టీంను అట్టిపెట్టుకుంది. మరి రిలీజ్ లిస్టు ఎవరంటే.?

కోర్ టీంకే మళ్లీ ఓటు
అనుకున్నట్టుగానే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ కోర్ టీంకే మళ్లీ ఓటు వేసింది. తమ హార్డ్ హిట్టర్లను అట్టిపెట్టుకుని.. బెంచ్‌ను బలోపేతం చేసే దిశగా పలువురు స్టార్ ఆటగాళ్ళను విడుదల చేసింది. లిస్టులో ఓ ప్రపంచకప్ విన్నర్ కూడా ఉండటం గమనార్హం.
హిట్టింగ్‌కు పెట్టింది పేరు
రెండు సీజన్ల నుంచి హిట్టింగ్‌కు పెట్టింది పేరుగా నిలిచింది హైదరాబాద్ జట్టు. ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపులు SRHకి మంచి ఆరంభాలను అందించాయి. వారితో పాటు హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమ్మిన్స్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలను కూడా రిటైన్ చేసుకుని.. తమ కోర్ టీంపై మళ్లీ భరోసాగా ఉంది కావ్య మారన్.
రిలీజ్ ప్లేయర్స్ లిస్టు
SRH రిలీజ్ ప్లేయర్స్ లిస్టు ఇలా ఉంది.. అభినవ్ మనోహర్, అథర్వ టైదే, సచిన్ బేబీ, వియాన్ ముల్దర్, సిమర్జీట్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, మొహమ్మద్ షమీలు ఈ లిస్టులో ఉన్నారు. ఇక వీరిలో షమీ.. లక్నో సూపర్ జెయింట్స్‌కి ట్రేడ్ అయిన విషయం తెలిసిందే.
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్ లిస్టు
అట్టిపెట్టుకున్న ప్లేయర్స్ లిస్టు ఇలా.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వెర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, కార్సే, పాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారి ఉన్నారు.
పర్స్ ఎంతుందంటే.?
ఈ రిలీజ్‌లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మొత్తం 15 మంది ప్లేయర్స్ ఉండగా.. రెండు ఓవర్సీస్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. అలాగే రూ. 25.50 కోట్ల పర్స్‌తో మినీ వేలంలోకి అడుగుపెట్టనుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ.