SRH ఫస్ట్ లేఆఫ్స్ వచ్చేశాయ్.! ఈ ముగ్గురు ప్లేయర్స్ ఇక కష్టమే.. కావ్యపాప మంచిపని చేసిందిగా
SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2026 మినీ వేలం కోసం తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్‌లను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ముగ్గురి విడుదల ద్వారా పర్స్ ను భారీగా పెట్టుకుని.. మినీ వేలంలోకి వెళ్లడానికి సిద్దమైంది.

ఐపీఎల్ మినీ వేలంలోకి ఇలా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2026 మినీ వేలం కోసం తమ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. IPL 2025 సీజన్ ముగిసిన తర్వాత, జట్టు భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా రిటెన్షన్, రిలీజ్ లిస్టులపై దృష్టి సారించింది. నవంబర్ 15 నాటికి రిలీజ్ జాబితా ప్రకటించే అవకాశం ఉండగా, డిసెంబర్ 15న మినీ వేలం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో SRH కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.
రిలీజ్ ప్లేయర్స్ వీరే
గత IPL సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణాలలో కొంతమంది ఆటగాళ్ల నిరాశజనక ప్రదర్శన అని తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేయాలని SRH నిర్ణయించుకున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారిలో ప్రధాన పేస్ బౌలర్ మహమ్మద్ షమీ మొదటిగా ఉన్నాడు. గత వేలంలో దాదాపు రూ.10 కోట్లు వెచ్చించి షమీని SRH సొంతం చేసుకుంది. అయితే అతను జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు.
ఇషాన్ రిలీజ్ విషయంలో ఉత్కంఠ
ఇక ఇషాన్ కిషన్ ను రూ.11.25 కోట్లతో కొనుగోలు చేశారు. కిషన్ గత IPL సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లలో మెరుగ్గా ఆడినప్పటికీ, స్థిరమైన ప్రదర్శన కనబరచడంలో విఫలమయ్యాడు. ఈ కారణాల వల్ల అతన్ని కూడా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మూడో ప్లేయర్ స్పిన్నర్ రాహుల్ చాహర్.
స్పిన్నర్ అన్నారు.. ఛాన్స్ ఇవ్వలేదు..
SRHకు ఒక మంచి స్పిన్నర్ అవసరమని భావించి రూ.3.20 కోట్లకు రాహుల్ చాహర్ ను తీసుకున్నారు. అయితే, అతనికి జట్టులో తగినన్ని అవకాశాలు లభించలేదు. జట్టు సమతుల్యత కోసం, వేలంలో మరో స్పిన్నర్‌ను కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో రాహుల్ చాహర్‌ను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్ పర్స్ తో మినీ వేలంలోకి..
ఈ ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా SRH సుమారు రూ.25 కోట్లకు పైగా పర్స్ ను ఆదా చేయనుంది. మినీ వేలంలో జట్టు దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో వెళ్లే అవకాశం ఉందని అంచనా. మరోవైపు, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లను మాత్రం SRH నిలుపుకోనుంది.