లేడీ కోహ్లీ సంపాదన చూస్తే మతిపోవాల్సిందే.. నికర ఆస్తుల విలువ ఎంతంటే.?
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టుకు 2025 ప్రపంచకప్ సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధాన నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా..? మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్ట్, డబ్ల్యూపీఎల్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా..

స్టార్ ఓపెనర్ అత్యధిక రన్ గెట్టర్
భారత మహిళల క్రికెట్ జట్టు 2025 వన్డే ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించడంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి, భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, ఓవరాల్‌గా అత్యధిక రన్ గెట్టర్‌లో రెండో స్థానంలో నిలిచింది.
ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర
ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రైజ్ మనీ కింద రూ. 40 కోట్లు లభించాయి. దీనికి అదనంగా బీసీసీఐ రూ. 51 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. ఇదిలా ఉంటే.. అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణిలలో ఒకరిగా ఉన్న స్మృతి మంధాన ఆదాయం, ఆస్తుల వివరాలపై ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
మ్యాచ్ ఫీజుల విషయానికొస్తే..
ఇదివరకే పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ ఫీజులను బీసీసీఐ అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. స్మృతి ఒక టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 6 లక్షలు అందుకుంటోంది. అంతేకాకుండా, బీసీసీఐ గ్రేడ్-ఏ సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఆమె ఏటా రూ. 50 లక్షల జీతం సంపాదిస్తోంది.
డబ్ల్యూపీఎల్ శాలరీ ఇలా..
విమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ స్మృతిని ఏకంగా రూ. 3.4 కోట్లతో కొనుగోలు చేసింది. అంతేకాదు హ్యుండాయ్, హీరో మోటోకార్ప్, రెడ్ బుల్, నైక్, మాస్టర్ కార్డ్, బాటా, పవర్, గల్ఫ్ ఆయిల్ వంటి అనేక ప్రఖ్యాత బ్రాండ్‌లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి రూ. 75 లక్షల నుంచి కోటిన్నర వరకు స్మృతి మంధాన తీసుకుంటున్నట్టు సమాచారం.
ఆస్తుల వివరాలు ఇలా..
ఇక ఆస్తుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని సాంగ్లీలో స్మృతికి జిమ్, హోమ్ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇల్లు ఉంది. ముంబై, ఢిల్లీలో కూడా ఆమెకు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె ఎస్ఎం18 స్పోర్ట్స్ కేఫ్ పేరుతో ఒక రెస్టారెంట్‌ను కూడా నడుపుతోంది. స్మృతి వద్ద సుమారు రూ. 70 లక్షల రేంజ్ రోవర్ ఎవోక్ కారు కూడా ఉంది. ప్రస్తుతం స్మృతి మంధాన నికర ఆస్తి విలువ సుమారు రూ. 34 కోట్లుగా అంచనా