RCBs IPL Trophy 17 ఏళ్లుగా ట్రోఫీ గెలవని ఆర్‌సీబీ: రీజన్ ఇదేనట!
RCB IPL Trophy : జట్టు నిండా స్టార్ క్రికెటర్లే. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాళ్లే. అయినా 17 ఏళ్లుగా ఆర్‌సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. దీనికి సీఎస్‌కే మాజీ ఆటగాడు షదాబ్ జకాతి ఏం చెబుతున్నారంటే..

అదే తేడా..
Reason Behind RCB Not Able to Win IPL Trophy For 17 Seasons : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఉన్న తేడాని మాజీ ఆటగాడు షదాబ్ జకాతి బయటపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఐపీఎల్ గెలిచిన జకాతి, తన క్రికెట్ కెరీర్ చివర్లో ఆర్‌సీబీ తరపున ఆడాడు.
ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య తేడా ఏంటంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఒక కుటుంబంలా ఉంటుంది. క్రికెట్ ఒక టీమ్ గేమ్. కప్పులు గెలవాలంటే టీమ్ కలిసి ఉండాలి. ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు అనుకుంటే ఏ టీమ్ గెలవలేదు.
చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎప్పుడూ మంచి భారతీయ, విదేశీ ఆటగాళ్లు ఉంటారు. కానీ నేను ఆర్‌సీబీలో ఉన్నప్పుడు, వాళ్లు ఇద్దరు ముగ్గురి మీదే ఆధారపడ్డారు. రెండు టీమ్‌ల యాజమాన్యం విధానం, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేరుగా ఉండేవి.
ఆర్‌సీబీలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ ప్లేయర్ల మధ్య సోదరభావం లేదు. అందుకే ఆర్‌సీబీ ప్లేయర్లు ఒక టీమ్‌గా కలవడం కష్టంగా ఉండేదని జకాతి స్పోర్ట్స్ కీడాతో చెప్పాడు.
అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆటగాళ్లను బాగా చూసుకుంటుంది. ప్లేయర్ల చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ పెడతారు. ఇలాంటి చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు పెద్ద మార్పు తెస్తాయి అని జకాతి అన్నాడు.