ఐపీఎల్ 2026 ముందుగానే ఆర్సీబీ పేరు మార్పు.. కారణమదేనా.?
RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని డియాజియో సంస్థ అమ్మకానికి ఉంచింది. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి 31, నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్, డబ్ల్యుపీఎల్ టైటిళ్లను గెలిచిన ఆర్సీబీ..

ఫర్ సేల్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఫర్ సేల్ అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జట్టును అమ్మేందుకు యాజమాన్య సంస్థ డియాజియో ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించినట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది.
రెండు ఐపీఎల్ టైటిల్స్
డియాజియోకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ ఈ అమ్మకాన్ని 2026, మార్చి 31 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008 నుంచి ఐపీఎల్‌లో భాగమైన ఆర్సీబీ.. 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే 2024లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్) టైటిల్‌ను కూడా మహిళా జట్టు కైవసం చేసుకుంది.
బ్రాండ్ వాల్యూ పెంపు..
విరాట్ కోహ్లీ, స్మృతి మందన వంటి స్టార్ ఆటగాళ్లు ఈ జట్టు బ్రాండ్‌ను మరింత పెంచారు. నివేదికల ప్రకారం, డియాజియో ఆర్సీబీ ఫ్రాంచైజీకి సుమారు 2 బిలియన్ అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 16,600 కోట్లు) కోరుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో, సంస్థ మొత్తం లాభంలో ఆర్సీబీ నుంచి 8.3 శాతం ఉండటం గమనార్హం.
కొనుగోలు చేసేది ఆయనేనా.?
వ్యాక్సిన్ కింగ్ అదర్ పూనావాలా ఈ ఆర్సీబీ జట్టును సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమ్మకం ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఫ్రాంచైజీ నవంబర్ 27న జరగబోయే డబ్ల్యుపీఎల్ వేలంలో పాల్గొనడంతో పాటు రాబోయే ఐపీఎల్ సీజన్‌లలో కూడా ఆడనుంది.
టీం పేరు మార్పు.?
అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్మకం పూర్తి అయ్యాక.. టీం పేరు కూడా మారుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం ఆర్సీబీ కసరత్తులు చేస్తోంది. జట్టులోని పేలవ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పక్కనపెట్టాలని చూస్తోంది.