కోహ్లీ ఉంటాడా.. లేడా.? RCB 10 రిటైన్ ప్లేయర్స్ లిస్టు ఇదిగో.. ఎవరెవరున్నారో తెలుసా
RCB: వచ్చే సీజన్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో, ఏ ఆటగాళ్లను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందో అనే ఉత్సుకత నెలకొంది.

10 మంది ప్లేయర్స్ వీరేనా..
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వచ్చే సీజన్‌లో మరోసారి విజేతగా నిలిచేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రిటైన్ ప్లేయర్‌ల జాబితాపై దృష్టి సారించగా, వచ్చే ఏడాదికి ఏ ఆటగాళ్లను ఆర్సీబీ రిటైన్ చేసుకోబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్సీబీ ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశం ఉన్న 10 మంది కీలక ప్లేయర్‌ల పూర్తి జాబితాను ఇప్పుడు చూసేద్దాం.
కోహ్లీ ఎప్పుడూ ఫస్ట్..
గత 18 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్న కింగ్ కోహ్లీ వచ్చే ఏడాది ఆర్సీబీకి ఆడడనే వార్తలు వస్తున్నప్పటికీ, అవన్నీ నిరాధారమైన వార్తలు. ఖచ్చితంగా ఆర్సీబీకే వచ్చే ఏడాది విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు. ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకునే మొదటి ప్లేయర్ విరాట్ కోహ్లీనే. తన బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీతో ఆర్సీబీ జట్టుకు తొలి ట్రోఫీని అందించిన రజత్ పాటిదార్ మరోసారి వచ్చే సీజన్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. రిటైన్ చేసుకునే రెండో ప్లేయర్‌గా రజత్ పాటిదార్.
టాప్ 3 ఖాయం..
మూడవ ప్లేయర్ ఫిల్ సాల్ట్. గత సంవత్సరం తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో ఆర్సీబీ జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందించాడు. ఈ క్రమంలో మరోసారి ఫిల్ సాల్ట్‌ను ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకోబోతోంది. ఆర్సీబీ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించడంలో ఆల్ రౌండర్ టీమ్ డేవిడ్ కీలకమైన పాత్ర పోషించాడు. కాబట్టి ఇతన్ని కూడా ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ అవకాశం వచ్చినప్పుడల్లా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అద్భుతంగా రాణించాడు. కృనాల్ పాండ్యా కూడా ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్‌ల జాబితాలో ఉన్నాడు.
ప్రధాన పేసర్ ఆసీస్ స్పీడ్ స్టర్..
ప్రధాన పేసర్‌గా జోష్ హాజిల్ వుడ్ మరోసారి ఆర్సీబీ జట్టుకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకునే పక్కా ప్లేయర్లలో జోష్ హాజిల్ వుడ్ కూడా ఒకడిగా ఉండబోతున్నాడు. ఏడవ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. తన అనుభవంతో ఆర్సీబీని ముందుండి నడిపించిన భువీ మరోసారి ఆర్సీబీకి ప్రధాన పేసర్‌గా ఉండబోతున్నాడు. ఆర్సీబీ కూడా ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్‌గా భువీ ఉండనున్నాడు.
వికెట్ కీపర్‌గా అతడు ఫిక్స్..
ఎనిమిదవ ప్లేయర్ జితేష్ శర్మ. గత సంవత్సరం ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు కూడా ఆడటం జరిగింది. ఇతను కూడా ఖచ్చితంగా రిటైన్ చేసుకునే ప్లేయర్‌గా ఉండబోతున్నాడు. తొమ్మిదవ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, సగటు ప్రదర్శనతో రాణించాడు. ఇతను టాప్ ఆర్డర్‌లో కీలకమైన ప్లేయర్‌గా ఉన్నాడు. పదో ప్లేయర్ రొమారియో షెఫర్డ్. ఇతను కూడా చాలాసార్లు హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. చిన్నచిన్న ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌లు ఆడాడు.