MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • ట్రోఫీ గెలవడంలో తెలుగమ్మాయ్‌దే కీ రోల్.. వాళ్లది కాదు: అశ్విన్

ట్రోఫీ గెలవడంలో తెలుగమ్మాయ్‌దే కీ రోల్.. వాళ్లది కాదు: అశ్విన్

Ravichandran Ashwin: భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో తెలుగమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. కడప జిల్లాకు చెందిన ఈ 21 ఏళ్ల స్పిన్నర్ 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. రవిచంద్రన్ అశ్విన్ శ్రీచరణిని ప్రశంసించారు.  

2 Min read
Author : Pavithra D
Published : Nov 05 2025, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీచరణి ప్రదర్శన కీలకమైనది
Image Credit : X/Johns.

శ్రీచరణి ప్రదర్శన కీలకమైనది

భారత మహిళల వన్డే ప్రపంచ కప్ విజయం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఉత్సాహాన్ని నింపింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో విజయం సాధించి, భారత మహిళల క్రికెట్ జట్టు తమ తొలి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ అపురూప విజయానికి పలువురు క్రీడాకారులు కృషి చేయగా, వారిలో తెలుగు తేజం నల్లపరెడ్డి శ్రీచరణి ప్రదర్శన అత్యంత కీలకమైనదిగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రపంచ కప్ ఆడిన తొలి క్రికెటర్‌గా..
Image Credit : ANI

ప్రపంచ కప్ ఆడిన తొలి క్రికెటర్‌గా..

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఈ యువ స్పిన్నర్ టోర్నీ అంతటా తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కలవరపెట్టింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 కీలక వికెట్లు పడగొట్టి, జట్టు విజయంలో భాగస్వామి అయ్యింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ కప్ ఆడిన తొలి క్రికెటర్‌గా శ్రీచరణి గుర్తింపు పొందింది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్లో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచి ఆసిస్ పతనాన్ని శాసించింది.

Related Articles

Related image1
IPL 2025: ఐపీఎల్ 2025 బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ ఎవరు? ఫ్యాన్స్ సర్వేలో టాప్ లో నిలిచింది ఎవరు?
Related image2
IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !
35
శ్రీచరణి ప్రదర్శన అద్భుతం
Image Credit : ANI

శ్రీచరణి ప్రదర్శన అద్భుతం

సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ కూడా శ్రీచరణి ప్రమాదకరమైన బౌలర్ అని అనడం.. శ్రీచరణి ఎంత డేంజర్ బౌలర్ అని చెప్పడానికి నిదర్శనం. భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా శ్రీచరణి ప్రదర్శన అద్భుతమని, భవిష్యత్తులో ఆమె తప్పకుండా సూపర్‌స్టార్ బౌలర్ అవుతుందని అశ్విన్ జోస్యం చెప్పారు.

45
గొప్ప విజయంగా..
Image Credit : ANI

గొప్ప విజయంగా..

శ్రీచరణి బౌలింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని కొనియాడిన ఆయన, ఆమె బంతిని తిప్పే విధానం, వేగం, బౌలింగ్ టెక్నిక్‌ను ప్రపంచంలోని గొప్ప స్పిన్నర్లయిన సోఫీ ఎక్లిస్టోన్, జెస్ జొనాసెన్ వంటి టాప్ బౌలర్లతో పోల్చారు. భారత మహిళల జట్టు సాధించిన ఈ విజయాన్ని అశ్విన్ ఇతర ప్రపంచ విజయాల కంటే ఎంతో గొప్పదిగా అభివర్ణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఉమెన్స్ జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని నేరుగా తీసుకువెళ్లి మాజీ దిగ్గజ క్రికెటర్లయిన మిథాలీరాజ్, ఝులన్ గోస్వామి వంటి వారికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించారు.

55
పరోక్షంగా పురుషుల జట్టుపై విమర్శలు
Image Credit : X

పరోక్షంగా పురుషుల జట్టుపై విమర్శలు

భారత పురుషుల జట్టు గతంలో ఇలా ఎప్పుడూ చేయలేదని, మాజీ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వడాన్ని చూడలేదని అశ్విన్ పరోక్షంగా పురుషుల జట్టు వైఖరిని ప్రస్తావించారు. భారత మహిళల జట్టు సాధించిన ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదని, ఇది దేశంలో మహిళా క్రికెట్ భవిష్యత్తుకు ఒక మైలురాయని అశ్విన్ పేర్కొన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IPL 2025: ఐపీఎల్ 2025 బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ ఎవరు? ఫ్యాన్స్ సర్వేలో టాప్ లో నిలిచింది ఎవరు?
Recommended image2
IPL 2026: సంజూ శాంసన్ మాత్ర‌మే కాదు.. రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఐదుగురు ప్లేయ‌ర్లు అవుట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved