తెలుగు టైటాన్స్ vs తమిళ్ తళైవాస్: ఉత్కంఠగా పీకేఎల్ సీజన్ 12 తొలి మ్యాచ్
Pro Kabaddi 2025: ప్రో కబడ్డీ 2025 లీగ్ తొలి మ్యాచ్ లో తమిళ్ తళైవాస్ 38-35తో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. అరుణ్ దేశ్వాల్, పవన్ సేహ్రావత్ చివరి క్షణాల్లో సూపర్ రైడ్‌తో అదరగొట్టారు.

సదర్న్ డెర్బీతో పీకేఎల్ 12 ఆరంభం
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 శుక్రవారం విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. సదర్న్ డెర్బీగా పోరుతో పీకేఎల్ 12 ప్రారంభమైంది. తొలి పోరులో తమిల్ తళైవాస్ - తెలుగు టైటాన్స్ పోటీ పడ్డాయి. ఈ పోరులో తమిళ్ తళైవాస్ 38-35 తేడాతో తెలుగు టైటాన్స్‌పై విజయం సాధించింది. ప్రో కబడ్డీ సీజన్ 12 తొలి మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ సీజన్ కు ఈ మ్యాచ్ గొప్ప ఆరంభంగా నిలిచింది.
கடைசில இறங்கி அடிச்சு முதல் வெற்றியை பிடிச்சாச்சு 😍🔥
பவன் பவர் 🙏#PKL12#ProKabaddi#TamilThalaivas#TeluguTitanspic.twitter.com/LZZd1zRqHy— ProKabaddi (@ProKabaddi) August 29, 2025
KNOW
అరుణ్ దేశ్వాల్ మెరుపులతో తళైవాస్ ఆధిక్యం
మ్యాచ్ మొదటి రైడ్ నుంచే అరుణ్ దేశ్వాల్ తన దూకుడు చూపించారు. సీజన్ 11లో కొనసాగించిన ఫామ్‌ను ఇక్కడ కూడా చూపించాడు. మొదటి రైడ్‌లోనే పాయింట్ సాధించి తన జట్టుకు ఆధిక్యం ఇచ్చారు. మరోవైపు, తెలుగు టైటాన్స్ తరఫున విజయ్ మాలిక్ కూడా తొలి రైడ్ తో పాయింట్ సాధించాడు.
భారత్ హుడా డూ-ఆర్-డై రైడ్‌లో రెండు పాయింట్లు తెచ్చి టైటాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. 10 నిమిషాలకే స్కోరు 5-5 సమంగా మారింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి తళైవాస్ 14-13తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్ళింది.
భారత్ హుడా 600వ రైడ్.. మళ్లీ టైటాన్స్ ఆధిక్యం
తొలి అర్ధభాగంలో భారత్ హుడా తన 600వ రైడ్ మైలురాయిని చేరుకున్నారు. రెండో అర్ధభాగం ప్రారంభంలోనే ఆయన హిమాంశు, సురేష్ జాధవ్‌లను డూ-ఆర్-డై రైడ్‌లో ఔట్ చేసి, టైటాన్స్‌కు ఆధిక్యం అందించారు. దీంతోనే సీజన్ తొలి ఆల్ ఔట్ నమోదు అయింది. టైటాన్స్ 19-14 ఆధిక్యం సాధించింది. ఈ సమయంలో టైటాన్స్ పూర్తి కంట్రోల్‌లోకి వెళ్ళారు.
తిరిగి పుంజుకున్న తమిళ్ తళైవాస్
అరుణ్ దేశ్వాల్ తన సూపర్ 10ను పూర్తి చేసి తళైవాస్‌ను మ్యాచ్‌లో నిలబెట్టారు. తర్వాత పవన్ సేహ్రావత్ తన అకౌంట్ తెరిచారు. ఇద్దరు రైడర్లు కలసి తళైవాస్‌ను మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చారు.
మ్యాచ్ చివరి ఐదు నిమిషాలు మిగిలి ఉండగా స్కోరు 28-28 సమమైంది. ఈ క్రమంలో నితేశ్ కుమార్ అశీష్ నార్వాల్‌ను ఔట్ చేసి, టైటాన్స్‌పై ఆల్ ఔట్ సాధించారు. స్కోరు 31-29తో తళైవాస్ ఆధిక్యంలోకి వెళ్లింది.
Stop him if you can - Arjun Deshwal 🔥#ProKabaddi#PKL12#TeluguTitans#TamilThalaivas#GhusKarMaarengepic.twitter.com/uyBiwQ2Gxs
— ProKabaddi (@ProKabaddi) August 29, 2025
చివరి క్షణాల్లో పవన్ సూపర్ రైడ్
భారత్ హుడా తన సూపర్ 10 పూర్తి చేసి స్కోరు తేడాను ఒక్క పాయింట్‌కు తగ్గించారు. కానీ, చివరి క్షణాల్లో పవన్ సేహ్రావత్ అద్భుతమైన సూపర్ రైడ్ చేసి తళైవాస్‌కు విజయాన్ని అందించారు. చివరి స్కోరు 38-35గా నమోదైంది.
తెలుగు టైటాన్స్ vs తమిళ్ తళైవాస్ మ్యాచ్ ముఖ్యాంశాలు
• తళైవాస్ విజయం: 38-35
• అరుణ్ దేశ్వాల్: సూపర్ 10 (ఈ సీజన్ లో ఫస్ట్ ప్లేయర్)
• పవన్ సేహ్రావత్: చివరి క్షణాల్లో సూపర్ రైడ్, 9 పాయింట్లు
• భారత్ హుడా: సూపర్ 10, 600వ PKL రైడ్
• ఆల్ ఔట్స్: రెండో అర్ధభాగంలో ఒక్కోసారి రెండు జట్లు సాధించాయి