దయచేసి తినడానికి ఏమైనా ఇవ్వండి..: ఒలింపిక్స్ పతక విజేత సరబ్‌జ్యోత్
ప్రపంచ దేశాలన్ని పాల్గొంటున్న ఒలింపిక్స్ 2024 కు ఆతిథ్యం ఇస్తున్న పారిస్ లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు కనువిందు చేస్తున్నాయి. పారిస్ వీధుల్లో ఘుమఘుమలాడే ఇండియన్ రుచులు దర్శనమిస్తున్నాయి. ఈ వంటకాలను చూసి ఒలింపిక్ పతక విజేత సరబ్‌జ్యోత్ నోరూరినట్లుంది...
Paris Olympics 2024
Paris Olympics 2024 : ఒలింపిక్స్ 2024... ప్రపంచ దేశాలన్నింటి చూపు ఇప్పుడు ఈ క్రీడలపైనే వుంది. ఈ విశ్వక్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఈ క్రీడల్లో భారత్ తరపున 117 మంది క్రీడాకారులు పొల్గొనగా ఇందులో కొందరు ఇప్పటికే మెడల్స్ సాధించారు... మరికొందరు మెడల్ రేసులో వున్నారు. ఇప్పటివరకు భారత్ 3 కాంస్య పతకాలను సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో మను భాకర్-సరబ్‌జ్యోత్ సింగ్ కాంస్యం సాధించారు.
Paris Olympics 2024
అయితే ఈ ఒలింపిక్స్ కోసం ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాల క్రీడాకారులు పారిస్ లో వాలిపోయారు. తమ క్రీడాకారులకు సపోర్ట్ చేసేందుకు వివిధ దేశాల క్రీడాభిమానులు, అతిథులు కూడా పారిస్ చేరుకున్నారు. దీంతో ప్రపంచానికి భారత సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేసేందుకు పారిస్ లో 'ఇండియా హౌస్' ఏర్పాటుచేసారు. లా విల్లెట్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ హౌస్ ను రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ ప్రారంభించారు.
Paris Olympis 2024
ఈ 'ఇండియా హౌస్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒలింపిక్స్ పతక విజేత సరబ్‌జ్యోత్ కూడా పాల్గొన్నాడు. అయితే ఇండియా హౌస్ అడుగు పెట్టగానే అతడు తినడానికి ఏమైనా ఇవ్వాలని కోరాడు. దీన్నిబట్టి మన క్రీడాకారులు పారిస్ లో స్వదేశీ ఫుడ్ ను మిస్ అవుతున్నారని అర్థమవుతోంది.
Paris Olympics 2024
భారతీయ సంస్కృతినే కాదు టూరిజంను ప్రమోట్ చేసేలా ఇండియా హౌస్ ను రూపొందించారు. ఇందులో యోగా, ఇండియన్ డ్యాన్స్, హెన్నా టాటూ, బ్లాక్ ప్రింటింగ్ వంటివి ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు భారతీయ రుచులను కూడా హౌస్ లో రుచిచూడవచ్చు. కమ్మనైన బిర్యాని, మటన్ కర్రీతో పాటు పసందైన పెరుగన్నం... ఇలా పారిస్ వీధుల్లో ఇండియా వంటకాల గుమగుమలను వెదజల్లుతోంది ఇండియా హౌస్.
Paris Olympics 2024
ఈ వంటకాలను చూడగానే మన షూటర్ సరబ్‌జ్యోత్ కు నోరూరినట్లుంది. ఇప్పటికే అతడి మెడల్ ఆకలి తీరింది... కాబట్టి ఇక అసలైన ఆకలిని తీర్చుకోవాలని భావించాడు. వెంటనే తనకు తినడానికి ఏమైనా కావాలని ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగాడు. తనకు ఇష్టమైన ఇండియన్ రుచులను ఆస్వాదిస్తూ కడుపునిండా తిన్నాడు.
Paris Olympics 2024
ఇలా ఇండియన్ క్రీడాకారులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ హౌస్ ను సందర్శించారు. నీతా అంబానీ దగ్గరుండి మరీ అందరికీ వంటకాలను రుచిచూపించారు. ఇలా పానీపూరి, బేల్ పూరి, దోస వంటి భారతీయ స్పెషల్ వంటకాలను వడ్డించారు. ఇలా ఇండియా హౌస్ లో స్వదేశీ వంటకాల రుచిని అందరూ ఆస్వాదించారు.
Paris Olympics 2024
భోజనం అనంతరం ఇండియా హౌస్ లో బాలీవుడ్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసారు క్రీడాకారులు. ఇలా 'నాటు నాటు'సాంగ్ కు క్రీడాకారులు చిందేసారు. ఇలా ఒలింపిక్ గేమ్ప్ జరుగుతున్న పారిస్ లో ఇండియా హౌస్ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.